మిర్చి కొని ఏడాది కాలంగా త‌ప్పించుకు తిరుగుతున్న వ్యాపారుల‌ను ప‌ట్టుకున్న గ్రామ‌స్తులు.. ఏం చేశారంటే..

|

May 09, 2021 | 4:37 PM

పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్న తిరుగుతున్న వ్యాపారులకు రైతులు షాకిచ్చారు. ఏడాది కాలంగా నగదు ఎగనామం పెట్టి..ఎవరికీ దొరక్కుండా పారిపోయిన...

మిర్చి కొని ఏడాది కాలంగా త‌ప్పించుకు తిరుగుతున్న వ్యాపారుల‌ను ప‌ట్టుకున్న గ్రామ‌స్తులు.. ఏం చేశారంటే..
Mirchi business
Follow us on

పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్న తిరుగుతున్న వ్యాపారులకు రైతులు షాకిచ్చారు. ఏడాది కాలంగా నగదు ఎగనామం పెట్టి..ఎవరికీ దొరక్కుండా పారిపోయిన వ్యాపారులను వెతికిపట్టి నిర్భంధించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు. జిల్లాలోని జూలూరుపాడ్, సుజాత నగర్, చండ్రుగొండ మండలాలు పక్క జిల్లాలోని కారేపల్లి, ఏన్కూర్, తల్లాడ మండలాలకు చెందిన రైతులు వ్యాపారులను బంధించారు. ఖమ్మంకు చెందిన బడా వ్యాపారి మిర్చి కమిషన్ దారుడు ఎర్ర అప్పారావు, ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలానికి చెందిన శ్రీహరి అనే ఇద్దరు వ్యాపారలను రైతులను నిర్భంధించారు. తమ వద్ద గతేడాది మిర్చి కొనుగోలు చేసి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని రైతులు వాపోయారు. జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలో వ్యాపారులను పట్టుకుని ఒక ఇంట్లో నిర్భందించారు.

తమకు ఇవ్వాల్సిన మిర్చి డబ్బులు తక్షణమే వ్యాపారులు చెల్లించాలని పట్టు పట్టడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు కరివారిగుండె చేరుకొని విచారణ చేశారు. విచారణలో సుమారు 50 మంది రైతులకు పైగా కోట్లల్లో వ్యాపారుల వద్ద నుండి డబ్భులు రావాలని రైతులు పోలీసులకు తెలిపారు. దీంతో సదరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమక్షంలో వ్యాపారులు.. 5రోజుల్లో రైతులకు డబ్బు చెల్లిస్తామని తెలిపారు. చేసిన అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నామని చెప్పుకున్నారు. తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించండి మహా ప్రబో అంటూ రైతులు కంటతడి పెట్టుకున్నారు.

Also Read: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణయం.. ఆక్సిజ‌న్ కోసం భారీగా నిధులు విడుదల‌

బార్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ఫైట్‌?.. సోషల్ మీడియాలో వార్త రచ్చ.. వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆ ఇద్దరు..!