AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: హైవేపై బైక్ స్టంట్స్‌తో.. గాల్లో తేలుతూ విన్యాసాలు.. కట్‌చేస్తే.. షాకింగ్ వీడియో

పట్టపగలే యువకులు రెచ్చిపోయారు. మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్లు స్థానికులు వారిస్తున్నా.. వినకుండా హైవేపై గాల్లో తేలుతూ వాహనదారులను భయ బ్రాంతులకు గురి చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు పోకిరీల స్టంట్స్‌ వీడియోలను రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.

Watch: హైవేపై బైక్ స్టంట్స్‌తో.. గాల్లో తేలుతూ విన్యాసాలు.. కట్‌చేస్తే.. షాకింగ్ వీడియో
Viral News
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 21, 2025 | 2:53 PM

Share

ఈ మధ్య కాలంలో యువత చేస్తున్న పోకిరి చేష్టలు మరీ మితిమీరి పోతున్నాయి. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం.. మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? అనేది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలానే రోడ్‌లపై బైక్‌లతో స్టంట్స్ చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేశారు కొందరు పోకిరీలు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద నేషనల్ హైవేపై కొందరు యువకులు బైక్ స్టంట్స్‌తో హల్ చల్ చేశారు. నలుగురు యువకులు పట్టపగలే రెండు బైక్ లపై విన్యాసాలు.. చేస్తూ, పెద్ద పెద్ద శబ్దాలు, కేకలతో న్యూసెన్స్ చేశారు.

హైవేపై వాహనదారులకు ఇబ్బంది కలిగేలా.. బైక్స్‌ను డ్రైవ్ చేస్తూ నానా రచ్చ చేశారు. అయితే రోడ్డుపై రెచ్చిపోయిన ఈ పోకిరీట బైక్‌ స్టంట్లకు కొందరు వాహనదారులు రికార్డ్ చేసి.. పోలీసులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతొ, వాళ్లు పంపిన వీడియోలోని బైక్స్‌ నెంబర్ల ఆధారంగా.. ఆ యువకును గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుల వివరాలు తెలిస్తే ఖమ్మం రూరల్ పోలీసులకు అందించాలని ప్రకటన విడుదల చేశారు. వీరి ఆచూకీ చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us