
తెలంగాణలోని మునుగోడు శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతోనే పోటీచేస్తామని పార్టీ తరపున ఎన్నికల బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కొత్త పేరు బీఆర్ ఎస్ పేరుతో పోటీచేస్తారనే ప్రచారం జరిగినప్పటికి, ఆ పేరును గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రావడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ పేరుతోనే పోటీచేయాలని నిర్ణయించారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక ఒక వ్యక్తి స్వార్థం కోసం వచ్చిన ఎన్నిక అని నఅ్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కుంటుంబ స్వార్థం కోసం 22వేల కోట్లకు ఆయనను అమ్ముకున్నాడుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ళుగా బీజేపీ తో టచ్ లో ఉన్నానని చెప్పి బీజేపీ లో చేరానని చెప్పారని, అమ్ముడు పోతూ దొరికిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని మంత్రి ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. త్యాగాలు చేశాం అని చెప్పటం అంటే ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. పూటకో మాట పూటకో అబద్ధం ఇద్దరు అన్నదమ్ములదని విమరర్శించారు. ఇప్పటివరకు జరిగిన అనేక ఉప ఎన్నికలు ఆయా కారణాల వల్ల వచ్చాయని, కాని ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశానంటున్నారు, బీజేపీ లో చేరితే ఏటువంటి అభివృద్ధి జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద పార్టీ వదిలి చిన్న పార్టీలోకి ఎందుకు వెళ్ళారని మునుగొడు ప్రజలు అడుగుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎదుగుతుంటే ఓర్వలేక, బాగుపడుతున్న తెలంగాణాను చూసి ఓర్చుకోలేని బీజేపీ ఓ వ్యక్తిని కొనుక్కొని తెచ్చుకున్న ఉపఎన్నిక ఇదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి. రాజగోపాల్ రెడ్డి చేసినపని ఎంతో నీచమైనదని ఆరోపించారు. మూడేళ్ళుగా కాంగ్రెస్ లో ఉండి, మోసం చేసి బీజేపీ లో చేరారని విమర్శించారు. అలాంటి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు క్షమించరన్నారు. బీజేపీ కి ఓటేస్తే బావుల దగ్గర మీటర్లు వస్తాయని, బీజేపీ కి ఓటేస్తే కరెంట్ సంస్కరణలు, గ్యాస్ ధర ఇంకో వంద పెరుగుతుందని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి.
మునుగోడు ఉపఎన్నిక భారతీయ జనతా పార్టీ ( బీజేపీ ) అభ్యర్థిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఖరారు చేసింది. రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన @BJP4India నాయకత్వం శ్రీ @narendramodi శ్రీ @AmitShah శ్రీ @JPNadda & శ్రీ @blsanthosh గారికి ధన్యవాదాలు. తప్పకుండా మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తాను. pic.twitter.com/MIo4c1frCs
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) October 8, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..