Telangana: కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..

|

Apr 24, 2024 | 9:51 PM

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్రగా నల్గొండ జిల్లాకు చేరుకున్న కేసీఆర్‌కు, తొలిరోజే ఎదరైన సంఘటన ఇది. ఆర్జాలబాయి దగ్గర రైతన్నలు కేసీఆర్‌ బస్సుని ఆపారు. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. మీరు ఉన్నప్పుడే బాగుందంటూ తమ బాధను కేసీఆర్‌కు చెప్పుకున్నారు రైతులు. అలాగే ఐకేపీ సెంటర్లో గన్నీ బ్యాగులతో ప్రదర్శన చేశారు రైతన్నలు.

Telangana: కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
Kcr
Follow us on

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్రగా నల్గొండ జిల్లాకు చేరుకున్న కేసీఆర్‌కు, తొలిరోజే ఎదరైన సంఘటన ఇది. ఆర్జాలబాయి దగ్గర రైతన్నలు కేసీఆర్‌ బస్సుని ఆపారు. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. మీరు ఉన్నప్పుడే బాగుందంటూ తమ బాధను కేసీఆర్‌కు చెప్పుకున్నారు రైతులు. అలాగే ఐకేపీ సెంటర్లో గన్నీ బ్యాగులతో ప్రదర్శన చేశారు రైతన్నలు. 20 రోజుల నుంచి కల్లాల్లో వడ్లు పోసుకొని కూర్చున్నా ధాన్యం కొనే నాథుడు లేడంటూ కేసీఆర్‌కు తెలిపారు. కరెంటు సరిగా ఉండట్లేదు.. రైతు బతుకంతా ఆగమైందంటూ సార్‌ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్‌. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నీళ్లు, కరెంట్‌ మళ్లీ తెచ్చుకుందాం.. పోరాటానికి సిద్ధంగా ఉండండి.. అంటూ నల్గొండ జిల్లా రైతులకు పిలుపునిచ్చారు కేసీఆర్. మొదటిరోజు బస్సు యాత్రలోనే రైతులు కేసీఆర్‌ను కలవడం.. ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..