MLC Kavitha: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత.. ఇవాళ ఈడీ ముందుకు భర్త అనిల్.. ఏ జరగనుంది..?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీ కొనసాగుతుండగానే ఎమ్మెల్సీ కవిత.. తన అరెస్ట్‌పై ఇవాళ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్‌ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా.. కవిత రిట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవoటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.

MLC Kavitha: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత.. ఇవాళ ఈడీ ముందుకు భర్త అనిల్.. ఏ జరగనుంది..?
Mlc Kavitha Anil
Follow us

|

Updated on: Mar 18, 2024 | 12:08 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీ కొనసాగుతుండగానే ఎమ్మెల్సీ కవిత.. తన అరెస్ట్‌పై ఇవాళ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్‌ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా.. కవిత రిట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవoటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ED అసిస్టెంట్ డైరెక్టర్ చేర్చారు. ఇదిలాఉంటే.. మరోవైపు కవిత భర్త అనిల్‌ను విచారించేందుకు సిద్ధమైంది ఈడీ. ప్రధానంగా మనీలాండరింగ్‌పై ప్రశ్నాస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

తొలి రోజు ఏడు గంటల పాటు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు అనంతరం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీస్‌లో తొలి రోజు ఏడు గంటల పాటు విచారించారు. రూల్స్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ భాను ప్రియ మీనా ఆధ్వర్యంలో రెండు బృందాలుగా అధికారులు కవితను ప్రశ్నించారు.

వాదనలు వినిపించనున్న కపిల్ సిబల్‌, రోహత్గీ

ఈడీ విచారణ అనంతరం కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్‌రావుతో పాటు న్యాయవాది ములాఖత్ అయ్యారు. ఈ క్రమంలో తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ కంటెప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్ట్ చేయటం.. రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేస్తుండటంతో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఈడీ అధికారుల విచారణ తీరును ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషనే ఇంకా తీర్పు రావాల్సి ఉండగా.. మరో పిటిషన్ వేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఐదు సెల్‌ఫోన్లు సీజ్ చేసిన ఈడీ

కవిత భర్త అనిల్‌తోపాటు.. ఆమె దగ్గర పనిచేస్తోన్న ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. శుక్రవారం కవిత అరెస్ట్ క్రమంలో ఈడీ ఐదు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసింది. వాటిలో అనిల్‌తోపాటు ముగ్గురు సిబ్బంది ఫోన్లు ఉన్నాయి. ఇవాళ్టి విచారణ సమయంలో వారి ముందే ఆ ఫోన్లను అన్‌లాక్‌ చేసి.. సమాచారాన్ని పరిశీలించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్‌ నుంచి రాబట్టనున్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌ కింద కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. ఆ నగదు హవాలాకు సంబంధించిన అంశాలపైనా అనిల్‌ను విచారించే అవకాశాలున్నాయి.

కవిత తొలి రోజు విచారణలో రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్ర స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇవాళ మొబైల్ ఫోన్ల మార్పు, బ్యాంక్ స్టేట్‌మెంట్ల ఆధారంగా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..
రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..
కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!
కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?