Kaleshwaram SI Case: కీచక ‘ఎస్సై’ నీచ బుద్ధి.. తుపాకీతో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం! దెబ్బకు ఉద్యోగం ఊస్టింగ్‌

మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్‌ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ ఏవీ రంగనాథ్ బుధవారం (జూన్‌ 19) ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్సై భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్..

Kaleshwaram SI Case: కీచక ఎస్సై నీచ బుద్ధి.. తుపాకీతో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం! దెబ్బకు ఉద్యోగం ఊస్టింగ్‌
Kaleshwaram PS SI Dismissed From Service

Updated on: Jun 20, 2024 | 12:15 PM

కాళేశ్వరం, జూన్‌ 20: మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్‌ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ ఏవీ రంగనాథ్ బుధవారం (జూన్‌ 19) ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్సై భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో మహిళా హెడ్ కానిస్టేబుల్ పై సదరు ఎస్సై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజనిర్ధారణ అయింది. దీనితో పాటు ఎస్సై భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్‌లో మరో కేసు కూడా నమోదైంది.

సదరు ఎస్సై తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లపై కూడా లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఎస్సై మహిళా సిబ్బందిపై వేధింపులకు పాల్పడడం అనేది పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది. ఎస్సై పై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా మల్టీ జోన్ I ఐజీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.