Kadiyam Srihari: బండి సంజయ్‌ ఉత్తరకుమారునితో సమానం.. సన్నాసుల మాటలు విని మోసపోవద్దు: కడియం శ్రీహరి

|

Jun 18, 2023 | 4:41 PM

Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ మళ్లీ లొల్లి షురూ అయింది.. స్థానిక ఎమ్మెల్యే రాజయ్యే టార్గెట్ గా కడియం శ్రీహరి మాటల తూటాలు పేల్చారు.. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.

Kadiyam Srihari: బండి సంజయ్‌ ఉత్తరకుమారునితో సమానం.. సన్నాసుల మాటలు విని మోసపోవద్దు: కడియం శ్రీహరి
Kadiyam Srihari Bandi Sanjay
Follow us on

Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ మళ్లీ లొల్లి షురూ అయింది.. స్థానిక ఎమ్మెల్యే రాజయ్యే టార్గెట్ గా కడియం శ్రీహరి మాటల తూటాలు పేల్చారు.. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. పరోక్షంగా స్థానిక MLA తాటికొండ రాజయ్యను టార్గెట్ చేసిన ఆయన ప్రజలు ఇచ్చిన ఖడ్గంతో ఆ అవినీతిని అంతమొందిస్తానన్నారు. నిజాయితీగా..మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నానని.. స్టేషన్‌ఘన్‌పూర్‌ను అన్నీరంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ కడియం శ్రీహరి పేర్కొన్నారు.  గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ధర్మసాగర్, జాఫర్ ఘడ్, స్టేషన్ ఘనపూర్ లో తండాలకు రోడ్లు వేసుకున్నామని గుర్తుచేశారు. ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, 11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించానన్నారు. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు.

రాబోయే రోజుల్లో నియోజవర్గం లోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే.. అని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం తనపై ఉండాలని.. స్టేషన్ ఘనపూర్ లో బంజారా భవన్ తో పాటు, సేవలాల్ భవన్ కూడా నిర్మిస్తామని స్పష్టంచేశారు. స్టేషన్ ఘనపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఆశీర్వదించి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల అభివృద్ధికి కృషి చేయాలి.. కానీ డబ్బులు దండుకోకూడదంటూ రాజయ్యను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలుచేశారు. రాబోయే ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

సన్నాసులు, దద్దమ్మల మాటలు విని మోసపోవద్దు..

అన్ని రంగాల్లో తెలంగాణ ముందన్నదని కడియం పేర్కొన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో, వైద్య ఆరోగ్యంలో ముందున్నదని తెలిపారు. 10 సంత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ కు ఒరగబెట్టింది ఏమీలేదని పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్, బిజెపిలు అక్కసు వెళ్లగక్కుతున్నరు.. సన్నాసులు, దద్దమ్మల మాటలు విని మోసపోవద్దంటూ సూచించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి తెలంగాణ బీజేపీ అధక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఉత్తర కుమారునితో సమానం అంటూ ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..