Jr.NTR: ఆ రోజున ఖమ్మం రానున్న ఎన్టీఆర్.. తారక్‏తో మంత్రి పువ్వాడ చర్చలు..

ఎన్టీఆర్ శతజయతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహా ఆవిష్కరణ చేయనున్నారు. ఈసందర్భంగా తాజాగా తారక్‏ను కలిశారు మంత్రి పువ్వాడ. విగ్రహ ఆవిష్కరణ ప్రారంభ ఏర్పాట్లపై ఎన్టీఆర్ తో చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Jr.NTR: ఆ రోజున ఖమ్మం రానున్న ఎన్టీఆర్.. తారక్‏తో మంత్రి పువ్వాడ చర్చలు..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: May 02, 2023 | 4:53 PM

ఖమ్మం నగరాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లకారం ట్యాంక్ బండ్ పై తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణకు ఎప్పటినుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈనెలలో జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ శతజయతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహా ఆవిష్కరణ చేయనున్నారు. ఈసందర్భంగా తాజాగా తారక్‏ను కలిశారు మంత్రి పువ్వాడ. విగ్రహ ఆవిష్కరణ ప్రారంభ ఏర్పాట్లపై ఎన్టీఆర్ తో చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ విగ్రహం తయారు పూర్తయి.. విగ్రహ తరలింపుకు రంగం సిద్ధమైంది. ఎటూ చూసిన 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడగుల విస్తీర్ణం ఉండే బేస్ మెంట్ పై ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. దాదాపు రూ..2.3 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.