Mobile Network: ఎయిర్టెల్, జియో నెట్‌వర్క్ సమస్యలతో తంటాలు పడుతున్న కస్టమర్లు

| Edited By: Aravind B

Oct 07, 2023 | 8:45 PM

మొబైల్ ఫోన్ వాడకుండా ఎవరూ కూడా ఒక్కరోజు ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల కొద్ది నిమిషాల వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పనిచేయనప్పుడు నెటీజన్లు కంగారుపడిపోయారు. అసలు ఏం జరిగిందో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాగే ఫోన్‌కు టవర్స్ నుంచి సిగ్నల్స్ రాకున్నా కూడా వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అసలు ఈరోజుల్లో ఇంటర్నేట్‌ను ఒక్కరోజు కూడా వాడకుండా ఉండలేని స్థితికి వచ్చేశాం. ఇదిలా ఉండగా.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు తలెత్తింది.

Mobile Network: ఎయిర్టెల్, జియో నెట్‌వర్క్ సమస్యలతో తంటాలు పడుతున్న కస్టమర్లు
Representative Image
Follow us on

మొబైల్ ఫోన్ వాడకుండా ఎవరూ కూడా ఒక్కరోజు ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల కొద్ది నిమిషాల వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పనిచేయనప్పుడు నెటీజన్లు కంగారుపడిపోయారు. అసలు ఏం జరిగిందో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాగే ఫోన్‌కు టవర్స్ నుంచి సిగ్నల్స్ రాకున్నా కూడా వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అసలు ఈరోజుల్లో ఇంటర్నేట్‌ను ఒక్కరోజు కూడా వాడకుండా ఉండలేని స్థితికి వచ్చేశాం. ఇదిలా ఉండగా.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు తలెత్తింది. జియో, ఎయిర్టెల్ నెట్‌వర్క్స్ సరిగ్గా లేకపోవడంతో కష్టమర్లు నానా తంటాలు పడుతున్నారు. ఉదయం 10 గంటలకు తలెత్తిన నెట్వర్క్ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో కస్టమర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సమస్య రెండు గంటలుగా ఎక్కువ కావడంతో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

కనీసం ఫోన్ కాల్స్ కనెక్ట్ కాకపోవడంతో తమ వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు జియో, ఎయిర్టెల్ కస్టమర్లు. ఒక్కసారిగా నెట్వర్క్ సమస్య తలెత్తడంతో అసలు సమస్య ఏం తలెత్తిందో తెలియక కస్టమర్లు అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్‌‌లోని పలు ప్రాంతలతో సహా పలు జిల్లాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జియో నెట్వర్క్ ఈ సమస్యను కొంత పరిష్కరించింది. కానీ ఎయిర్టెల్ మాత్రం ఇంకా నెట్వర్క్ సమస్యను పరిష్కరించే పనిలోనే ఉంది. ఈ నెట్వర్క్ సమస్యల ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుడప్పుడు ఇలా సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఆ తర్వాత ఆయా సంస్థలు అందులో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసి మళ్లీ నెట్‌వర్క్‌ను సాధారణ స్థితికి తీసుకొస్తారు. అయితే ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లు సరిగా పనిచేయకపోవడంతో.. ఈ సమస్యలను తొందరగా పరిష్కరించాలని ఫోన్ యూజర్లు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..