మెగా ఫ్యామిలీ ఇలవేల్పు ఆంజనేస్వామికి పూజలు చేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సమరాన్ని ప్రారంభిస్తారు. జనసేన పార్టీని 2009లో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న తర్వాత పవన్ ప్రారంభించారు. దీంతో పవన్ సెంటిమెంట్‌గా భావించే ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలోని కొండగట్టు అంజన్నక్షేత్రంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
పవన్‌కళ్యాణ్ హైదరాబాద్ ఉదయం 7 గంటలకు జగిత్యాలజిల్లాకు పయనం అయ్యారు. కొండగట్టు హనుమంతుడి ఆలయానికి చేరుకొని అక్కడ ఉదయం 11 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు.
సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల తర్వాత అనుష్టుప్ నారసింహ యాత్రను ప్రారంభించి, 32 నారసింహ క్షేత్రాలను దర్శించుకోబోతున్నారు. ధర్మపురి సందర్శనతో అనుష్టుప్ యాత్రకు శ్రీకారం చుడతారు పవన్. అక్కడ నుంచి మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను దర్శిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌జిల్లా యాత్ర తర్వాత పవన్ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..