
త్వరలోనే జరిగే తెలంగాణ అసెంబ్లీ పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ ప్రకటించింది. బీజేపీ పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ విషయానికొస్తే.. కూకట్ పల్లి పరిధిలో ప్రేమ్ కుమార్ బరిలోకి దిగనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా#TelanganaElection2023 pic.twitter.com/hFXrubYMEC
ఇవి కూడా చదవండి— JanaSena Party (@JanaSenaParty) November 7, 2023
కాగా బీజేపీ- జనసేన పార్టీల పోత్తు కుదిరిన తరువాత ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. సభ ఆరంభంలోనే ముఖ్య నాయకులతో పాటు పవన్ కల్యాణ్ ముందు గానే సభ స్థలికి చేరుకున్నారు. కాగా పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో ప్రచారానికి వస్తే కచ్చితంగా తమకు మేలు జరుగుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ప్రచారానికి పవన్‌ను ఉపయోగించుకోవాలని తెలంగాణ బీజేపీ అభ్యర్థులు భావిస్తున్నారు. చూడాలి మరి పవన్ ప్రచారంలో పాల్గొంటారో లేదో చూడాలి.
హైదరాబాద్ లో బిజెపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారితోపాటు పాల్గొన్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు#TelanganaElections2023 #JSPBJPAlliance pic.twitter.com/tQfz2IXgra
— JanaSena Party (@JanaSenaParty) November 7, 2023
తెలంగాణ అభివృద్ధి ఆకాంక్ష నెరవేరాలి
• ఆత్మగౌరవం, అణగారిన వర్గాల అస్తిత్వం కోసం తెలంగాణ అంతా కలిసి కొట్లాడింది
• నీళ్లు, నిధులు, నియామకాల కోసం నిష్టగా సాగిన గొప్ప పోరాటం తెలంగాణ ఉద్యమం
• బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడమే బీజేపీ ఎజెండా
• తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి జనసేన… pic.twitter.com/5jXgq77AQa
— JanaSena Party (@JanaSenaParty) November 7, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..