Jagtial Election Result 2023: జగిత్యాలలో త్రిముఖ పోరు.. ఓటర్ల మనసులో ఉన్నది ఎవరు?

Jagtial Assembly Election Result 2023 Live Counting Updates: మళ్ళీ పాత కాపుల మధ్యన పోరు నెలకొంది.. అయితే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తోంది. గతంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా పనిచేసిన భోగ శ్రావణి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి తనకు చివరి ఎన్నికలంటూ ప్రచారం చేశారు. రెండోసారి అవకాశం ఇస్తే, మరింత అభివృద్ధి చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ ఓట్లు అడిగారు.

Jagtial Election Result 2023: జగిత్యాలలో త్రిముఖ పోరు.. ఓటర్ల మనసులో ఉన్నది ఎవరు?
Jeevan Reddy Sanjay Kumar Boga Sravani

Edited By:

Updated on: Dec 03, 2023 | 10:04 AM

Jagtial Assembly Election Result 2023 Live Counting Updates: తెలంగాణ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ పాత కాపుల మధ్యన పోరు నెలకొంది..  గతంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా పనిచేసిన భోగ శ్రావణి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తనకు ఇదే చివరి ఎన్నికలంటూ ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా చివరి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.  రెండోసారి అవకాశం ఇస్తే, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ హామీ ఇచ్చారు. మరి ఇక్కడ.

జగిత్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మరోసారి బరిలో నిలిచారు.  సంజయ్ కుమార్ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తరువాత 2018లో భారీ మెజారిటితో సంజయ్ విజయం సాధించారు. ఈ రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో తలపడగా.. మూడోసారి కూడా ఆయనతోనే పోటీ పడుతున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు.. తనకు చివరి ఎన్నికలంటూ.. సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

జగిత్యాల రాజకీయ ముఖచిత్రం..

ప్రతిసారీ.. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు ఉంది. ఇప్పుడు వీటికి తోడు బీజేపీ కూడా రంగంలోకి దిగింది.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విబేధాల కారణంగా.. మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఈమెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు.

అయితే, ఇక్కడ పద్మశాలి ఓట్లు.. ప్రభావితం చేస్తాయి. ఇదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శ్రావణి. అంతేకాకుండా బీసీ నినాదాన్ని కూడా బీజేపీ ఎత్తుకుంది. అదే విధంగా మహిళ ఓటర్లపై ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే సంజయ్‌కు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్క వేళా బీఆర్ఎస్ ఓట్లను చీల్చితే.. కాంగ్రెస్‌కు లాభం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే విధంగా జగిత్యాల నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు కూడా ప్రభావం చూపుతాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్ కు ఓటు వేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో తనకు ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ భావిస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం.. మైనారిటీ ఓట్లు తనకే వస్తాయని ధీమాతో ఉన్నారు. మైనారిటీ ఓట్లు రెండు పార్టీలు చీల్చుకుంటే.. తనకు లాభం జరుగుతుందని బీజేపీ భావిస్తుంది.

బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పూర్తిగా నమ్ముకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఎక్కవ మంది లబ్ధిదారులకు అందజేశారు. అదే విధంగా మౌలిక వసతులు తాగు, సాగు నీటి సమస్య లేకుండా చేశానని చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాత్రం దళిత బంధు, బీసీ బంధు ఇతర సంక్షేమ పథకాలు: అందలేదని, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. జీవన్ రెడ్డి కూడా సీఎం రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మొదటి సారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీగా చేస్తున్నారు శ్రావణి. బిసి నినాదంతో పాటు.. పసుపు బోర్డు లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళ ఓటర్లు అధికంగా ఉండటంతో, వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి, ఈ మూడు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

మరోసారి జీవన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తానని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చెబుతున్నారు. తాను చేసిన అభివృద్దే గెలుపుస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు తప్పా.. ఎవరూ అభివృద్ధి చెందలేని.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదంటున్నారు. ఇంతకాలం బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను చూశారని. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి. బీసీలకు తమ పార్టీ అవకాశం ఇచ్చిందని, తనను గెలిపించాలని కోరుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్