చింత పంటను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు మహిళ అద్భుత చిట్కా.. వానరాల ఆ ఏరియాకి వస్తే ఒట్టు..!

|

Mar 13, 2021 | 9:46 PM

జనగాం జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంట పొలాలను, పండ్ల తోటలను దెబ్బతీస్తున్నాయి. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంటి పెరట్లో ఉన్న...

చింత పంటను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు మహిళ అద్భుత చిట్కా.. వానరాల ఆ ఏరియాకి వస్తే ఒట్టు..!
Women Crazy Idea
Follow us on

జనగాం జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంట పొలాలను, పండ్ల తోటలను దెబ్బతీస్తున్నాయి. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంటి పెరట్లో ఉన్న చింత చెట్లకు ఉన్న కాయలను కాపాడుకునేందుకు సరికొత్త ప్రయోగం చేసింది. ఇందులో భాగంగా రెండు పెద్దపులి బొమ్మలు కొనుగోలు చేసింది. పైన చూపిన విధంగా కోతులకు చెక్‌ పెట్టింది.

ఓ సాధారణ గృహిణి కొచ్చిన ఆలోచన తన జీవితాన్నే మార్చి వేసింది. ఒక చిన్న చిట్కాతో తనకున్న చింత చెట్ల ఆదాయాన్ని కాపాడుకోగలుగుతుంది. మాములుగా అయితే, కుక్కలను, కొండెంగలను, పులులను, సింహాలను చూసిన కోతులు తుర్రుమని పారిపోతాయి. అందుకే గొల్లపల్లికి చెందిన హైమవతి చేసిన ప్రయత్నంతో తన చింత చెట్లకు కాసిన చింతకాయ, పండ్లను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నంతో తమ గ్రామస్తులు మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా హైమవతి ఆలోచనకు ఆశ్చర్యపోతున్నారు.

హైమావతి ఈ చిట్కాను ఆచరించడం కోసం రెండు పులి బొమ్మలు మాత్రమే ఉపయెగించింది. అయితే, తనక వచ్చిన ఈ ఐడియా…ఒక సినిమాలో చూశానని చెబుతోంది. తన పంటను కాపాడు కోవాలంటే పులైతేనే సెక్యురిటిగా,,, కరెక్ట్ అని భావించింది. అంతే..రెండు బొమ్మలు కొనితెచ్చింది…ఆ చెట్ల పరిసరాల్లో ఏర్పాటు చేసింది. దీంతో కోతులు మటు మాయం అయ్యాయి. ఈ పులి బొమ్మలను చూసిన కోతులు భయంతో ఇటు వైపే రాకుండా పోయాయని చెబుతోంది. ఇంతకాలం ఇళ్లలోకి దూరి నానా బీభత్సం చేసే కోతుల బెడద తప్పిందని హైమావతి ధీమా వ్యక్తం చేస్తోంది.

హైమవతి అనుసరించిన టైగర్ డాల్ ఆలోచనే ఈ గ్రామ రైతులకు, స్థానికులకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు రైతులు కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు కూడా ఇదే ప్లాన్‌ అమలు చేస్తున్నారు. హైమవతి ఆలోచన బాగుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…