Watch Video: వామ్మో ఇదేంట్రా బాబు.. మహిళ తింటున్న కర్రీపఫ్‌లో దర్శనమిచ్చిన పాము!.. తర్వాత ఏం జరిగిందంటే!

మహబూబ్‌నగర్‌ జిల్లాలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్‌ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తను తింటున్న కర్రీపఫ్‌లో పాము కనిపించడంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Watch Video: వామ్మో ఇదేంట్రా బాబు.. మహిళ తింటున్న కర్రీపఫ్‌లో దర్శనమిచ్చిన పాము!.. తర్వాత ఏం జరిగిందంటే!
Mahabubnagar News

Edited By:

Updated on: Aug 13, 2025 | 12:22 PM

మహబూబ్‌నగర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్‌ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తను తింటున్న కర్రీపఫ్‌లో పాము కనిపించడంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒక మహిళ జడ్చర్ల లోని ఒక బేకరీకి వచ్చింది. అక్కడ ఒక కర్రీ పఫ్‌ను ఆర్డర్‌ చేసింది. వెంటనే వెయిటర్‌ ఆమెకు కర్రీపఫ్‌ను తెచ్చి ఇచ్చాడు. వేయిటర్‌ దగ్గర నుంచి కర్రీ పఫ్‌ను తీసుకున్న సదురు మహిళ తినడం స్టార్ట్‌ చేసింది.

అయితే ఆమెకు కర్రీపఫ్‌ రుచిలో ఏదో తేడాగా అనిపించడంతో వెంటనే దాన్ని ఒపెన్‌ చేసి చూసింది. అందులో కనిపించిన పామును చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే బెకరీ నిర్వాహకులను నిలదీసింది. ఆ తర్వాత స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వీడియో చూడండి..

ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.