Telangana: ఆసక్తికరంగా మారిన సీఎం ఢిల్లీ టూర్‌.. క్యాబినేట్‌ విస్తరణతో పాటు..

కార్పొరేషన్‌ చైర్మన్ల ఎంపికపై అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించుకుని వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో కేబినేట్ విస్తరణ, కార్పొష‌న్ ప‌దవుల భ‌ర్తీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులపై అధిష్టానంతో చర్చిస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు...

Telangana: ఆసక్తికరంగా మారిన సీఎం ఢిల్లీ టూర్‌.. క్యాబినేట్‌ విస్తరణతో పాటు..
Revanth Delhi Tour

Updated on: Feb 20, 2024 | 7:26 AM

సీఎం రేవంత్‌ ఢిల్లీ టూర్‌తో తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ హీట్ పెరుగుతోంది. మొన్నటిదాకా బడ్జెట్‌ స‌మావేశాల‌తో బిజీగా ఉన్న రేవంత్ ఢిల్లీ వెళ్లారు. రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్‌ హస్తిన పర్యటన మంత్రి వర్గ విస్తరణ అజెండాగా సాగుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ టూర్‌లో కార్పొరేషన్ల పదవుల భర్తీపై కూడా రేవంత్‌ టూర్‌తో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు.

కార్పొరేషన్‌ చైర్మన్ల ఎంపికపై అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించుకుని వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో కేబినేట్ విస్తరణ, కార్పొష‌న్ ప‌దవుల భ‌ర్తీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులపై అధిష్టానంతో చర్చిస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కసరత్తు ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలో హైకమాండ్‌ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారని సమాచారం.

కేంద్ర మంత్రలును కలిసే అవకాశం..

ఇక ఢిల్లీ పర్యాటనలో భాగంగా సీఎం పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్‌ కోరినట్లు తెలుస్తోంది. సమయం దొరకగానే వాళ్లతో భేటీ అవుతారని సమాచారం. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను రేవంత్‌ కలవనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నితిన్‌ గడ్కరీతో రేవంత్‌ భేటీ అవుతారు. మొత్తానికి అటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు అధికారిక కార్యక్రమాలను కూడా రేవంత్‌ చక్కపెట్టుకోనున్నారు.

ఇదిలా ఉంటే కేబినేట్‎లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మందిని మాత్ర‌మే తీసుకున్నారు. ఇంకో ఆరుగురికి అవకాశం ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు విస్త‌ర‌ణ చేప‌ట్ట‌లేదు. ఇప్పుడు ఢిల్లీ టూర్‎తో దీనిపై క్లారిటీ రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కేబినేట్ విస్త‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి అయింది. ఇప్ప‌టికే 10 ఉమ్మ‌డి జిల్లాలో రెండు ఉమ్మ‌డి జిల్లాల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. అవే నిజామాబాద్, అదిలాబాద్. ఈ రెండు జిల్లాల‌కు సంబంధించి మంత్రులను భ‌ర్తీ చేసే అవ‌కాశం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..