AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheruvugattu Jatara: వైభవంగా జడల రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు.. నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు..

ముందు పర్వత వాహనంపై పార్వతీ పరమేశ్వర్లు ఉరేగింపు ఘనంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం వీర ముష్టి వంశీయులు తొలి పూజలు నిర్వహించారు. రైతులు భక్తి శ్రద్దలతో అగ్ని గుండాలలో ధాన్యాన్ని సమర్పించారు. తెలుగు రాష్ట్రాలు సహా  ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రోజు రోజుకు భక్తు రద్దీల పెరుగుతోంది. చెరువు గట్టు క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Cheruvugattu Jatara: వైభవంగా జడల రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు.. నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు..
Cheruvugattu Jatara 2024
Surya Kala
|

Updated on: Feb 20, 2024 | 7:32 AM

Share
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టులో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. పర్వత వాహనంపై స్వామివార్లను ఆశీనులుగా ఉంచి వీర ముష్టి వంశీయులతో మొదట పూజలనిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా  చెరువు గట్టు క్షేత్రంలో అగ్ని గుండాలు నిర్వహించారు. మనసారా స్వామిని కొలుస్తూ అగ్ని గుండంలో నడిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా  ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భక్తులు నిప్పులపై నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు.  అగ్నిగుండాలలో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించారు.
అంతకు ముందు పర్వత వాహనంపై పార్వతీ పరమేశ్వర్లు ఉరేగింపు ఘనంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం వీర ముష్టి వంశీయులు తొలి పూజలు నిర్వహించారు. రైతులు భక్తి శ్రద్దలతో అగ్ని గుండాలలో ధాన్యాన్ని సమర్పించారు. తెలుగు రాష్ట్రాలు సహా  ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రోజు రోజుకు భక్తు రద్దీల పెరుగుతోంది. చెరువు గట్టు క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చెరువుగట్టు  క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న హామీపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టులో వైభవంగా శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..