AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీ కాంగ్రెస్‎కు కొత్త కష్టాలు.. టాగూర్ పోయి ఠాక్రే వచ్చిన సెట్ అవ్వడం లేదా ?

గత కొద్దిరోజులుగా టీ కాంగ్రెస్ అనవసర విషయాలలో వేలు పెట్టి కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఈ మధ్య ఠాక్రే వ్యవహారం పీసీసీ, సీఏల్పీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు ఠాక్రే. అయితే ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య మోడీని కలవడం కాంగ్రెస్‎కు పెద్ద మైనస్ అయిందనే చర్చ టీపీసీసీలో జరుగుతుంది. ఆర్ కృష్ణయ్యను ఠాక్రే కలిసే విషయం కూడా చివరి నిమిషంలో పీసీసీకి చెప్పారని సమాచారం.

Telangana: టీ కాంగ్రెస్‎కు కొత్త కష్టాలు.. టాగూర్ పోయి ఠాక్రే వచ్చిన సెట్ అవ్వడం లేదా ?
Congress Party
TV9 Telugu
| Edited By: Aravind B|

Updated on: Sep 03, 2023 | 9:53 PM

Share

గత కొద్దిరోజులుగా టీ కాంగ్రెస్ అనవసర విషయాలలో వేలు పెట్టి కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఈ మధ్య ఠాక్రే వ్యవహారం పీసీసీ, సీఏల్పీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు ఠాక్రే. అయితే ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య మోడీని కలవడం కాంగ్రెస్‎కు పెద్ద మైనస్ అయిందనే చర్చ టీపీసీసీలో జరుగుతుంది. ఆర్ కృష్ణయ్యను ఠాక్రే కలిసే విషయం కూడా చివరి నిమిషంలో పీసీసీకి చెప్పారని సమాచారం. ఇక మందకృష్ణ మాదిగను గాంధీ భవన్‎కు ఆహ్వానించి , ఆ తర్వాత మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ను విమర్శించడం మరో పంచాయతీ అయ్యింది. దీంతో టీ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి ,మందకృష్ణ మాదిగకు మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో మందకృష్ణ విషయంలో ఎరక్కపోయి ఇరుక్కున్నామా అనే పరిస్థితి వచ్చింది.

కాంగ్రెస్ కు.. ఇక లెఫ్ట్ పార్టీలతో చర్చలు అంటూ ఠాక్రే రంగంలోకి దిగడం కాంగ్రెస్ లో మరో రచ్చకు దారితీసింది. బీఆర్ఎస్ తో పొత్తు వికటించడంతో కాంగ్రెస్ తో పొత్తుకు లెఫ్ట్ పార్టీ లు సుముఖంగా ఉన్నాయని సమాచారం. దీంతో సీపీఐ నేతలతో ఠాక్రే చర్చలు జరిపారు. అయితే ఇదంతా పీసీసీ, సీఏల్పీ లకు తెలియకుండా జరుగుతుంది అని పార్టీ లో టాక్. పీసీసీ, సీఏల్పీ లతో చర్చలు చేయకుండానే ఠాక్రే ఇతర పార్టీ లతో చర్చలు జరుగుతున్నారని ,పార్టీకి లాభ నష్టాలను అంచనా వేయకుండా ఠాక్రే వ్యవహారం కొత్త చిక్కులు తెచ్చిపెడుతుందని టీపీసీసీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం ,నల్లగొండ జిల్లాలలో లెఫ్ట్ పార్టీలు సీట్లు అడిగే అవకాశం ఉందని.. కానీ ఖమ్మం, నల్లగొండలో పార్టీ ఇప్పటికే బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పార్టీని డిస్టబ్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉండే పీసీసీ ఛీఫ్, సీఏల్పీలతో చర్చించకుండా ఠాక్రే సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ నేతలను అయోమయానికి గురిచేస్తుందని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్ కృష్ణయ్య.. మంద కృష్ణమాదిగలతో ఠాక్రే భేటీ వల్ల జరిగిన పర్యవసానాలను ఏఐసీసీకి నివేదించారట టీపీసీసీ నేతలు.. ఏఐసీసీ నుంచి ఇంఛార్జ్‎కి క్లియర్ డైరెక్టర్ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు కూడ సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గతంగా వివాదాలు జరిగితే పార్టీకే నష్టమని రాజకీయం విశ్లేషకులు చెబుతున్నారు.