ప్రజాకవి గద్దర్ మరణ వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గద్దర్ అంత్యక్రియలను మహా బోధా స్కూల్‌లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం గద్దర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు ఎల్బీ స్టేడియంకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేపుతోంది. సజ్జనర్‌కు గద్దర్‌కు మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోందీ ట్వీట్. ఇంతకీ గద్దర్‌కు, సజ్జనార్‌కు మధ్య ఉన్న ఆ బంధం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
సజ్జనార్ ఐపీఎస్, ఈ పేరు వినగానే ఎన్‌కౌంటర్ గుర్తుఒస్తుంది. అయితే తాజాగా సజ్జనార్ మరోసారి హార్ట్ టాపిక్‌గా మారారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ కి నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన ట్వీట్ పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఇంతకీ సజ్జనార్ కి ,గద్దర్ కి ఉన్న సంబంధం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో బీసీ సజ్జనర్ ఒకరు. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఏర్పడ్డ స్పెషల్ ఇంటెలిజెంట్ బ్యూరో ఎస్ఐబికి ఐజిగా పనిచేసిన సజ్జనార్ మావోయిస్టుల ఎరివేతలో కీలకంగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్‌కౌంటర్స్‌లో అత్యంత కీలకపాత్ర పోషించారు. అట్లాంటి వ్యక్తి ప్రజా యుద్ధనౌక ,మావోయిస్టు సానుభూతిపరుడు విప్లవ వాది అయిన గద్దర్ కి చాలా దగ్గర వ్యక్తి.
గద్దర్ చనిపోయాక సజనార్ స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి ప్రధాన కారణం గద్దర్ పైన నమోదైన ఒక కేసుకు సంబంధించిన విషయం. సజ్జనారే లేకుంటే గద్దర్ సైతం విరసం నేత వరవరరావులాగా జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చేది. మావో సానుభూతిపరులంటూ అర్బన్ నక్సలైట్ అంటూ దేశవ్యాప్తంగా అనేక మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఎన్ఏ అధికారులు గద్దర్ పైన సైతం కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు, కానీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన సజ్జనార్ వల్లనే NIA అధికారులు గద్దర్ పైన కేసు నమోదు చేయలేకపోయారు.
కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి!
గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న.
పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని… pic.twitter.com/TwtYTnzoCW
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 6, 2023
గద్దర్ అంటే తనకు అభిమానమని గద్దర్ పాటలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన తన ట్వీట్ ద్వారా తెలిపారు.. ఎప్పుడూ గద్దర్ని కలిసిన తనపైన నమోదైన 32 కేసుల గురించే చర్చించేవాడని, తెలంగాణ వచ్చిన తర్వాత సైతం అనేక సందర్భాల్లో తన కలిసి కేవలం కేసుల గురించే చర్చించేవాడని, ఆ కేసులకు సంబంధించి ఏం కాదని దాని ధైర్యం చెప్పి పంపించేవానాన్నని ఆయన గుర్తు చేసుకున్నారు. పోలీస్ శాఖలో సజ్జనార్ లాంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మావోయిస్ట్ యాంటీ ఆపరేషన్‌లో పనిచేసిన ఆయన గద్దర్ పై ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..