తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమవుతున్నఇంటర్ పరీక్షలు రాసేందుకు వెళ్లున్న ఓ విద్యార్థిని గూగుల్ మ్యాప్స్ మోసం చేసింది. అవును, గూగుల్ మ్యాప్స్ యాప్ చూపించిన దారిని అనుసరిస్తూ వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్‌కు కాకుండా వేరే సెంటర్‌కు వెళ్లి.. చివరికి పరీక్ష రాయకుండానే వెనుదిరిగాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఆ విద్యార్థి. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందని వినయ్ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి చదువుతున్నాడు. ఈ రోజు ఇంటర్ పరీక్ష ఉండడంతో పరీక్ష పెంటర్‌కు వెళ్లే దారి కోసం గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించాడు. ఆ క్రమంలో గూగుల్ మ్యాప్స్ చూయించిన ఓ ఓ ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు.
అయితే చేరుకున్న తర్వాతే అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని వినయ్‌కి తెలిసింది. దీంతో తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ వివరాలు తెలుసుకుని వెంటనే అక్కడకు చేరుకున్నాడు. కానీ అప్పటికే ఎగ్జామ్ ప్రారంభ సమయం కంటే చాలా ఆలస్యం కావడంతో అతడిని ఎగ్జామ్ సెంటర్‌లో సిబ్బంది.. పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వినయ్ కన్నీళ్లతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
కాగా, తెలంగాణ ఇంటర్ పరీక్షలు 2022-23 కోసం 4,82,677 మంది ఇంటర్ ఫస్టియర్, 4,65,022 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎగ్జామ్స్ కోసం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 26,333 ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 200 సిట్టింగ్ స్క్వాడ్‌లను కూడా బోర్డు ఏర్పాటు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..