AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది.. ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్డేట్..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది.. తాజాగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.. డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు..

Indiramma Houses: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది.. ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్డేట్..
Indiramma Housing Scheme
Shaik Madar Saheb
|

Updated on: Dec 03, 2024 | 8:22 AM

Share

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది.. తాజాగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.. డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.. డిసెంబరు రెండో వారం నాటికి లబ్ధిదారులకు ఉత్తర్వులు విడుదల చేసేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగా మొదటి విడతగా నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ క్రమంలోనే.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈనెల 5నుంచి ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.

ఇందిరమ్మ రాజ్యం అంటేనే .. ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా 4.5లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే నాలుగేళ్లపాటు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ కొనసాగుతోందన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మంత్రి తెలిపారు. వీటికోసం ఇప్పటికే.. 3వేల కోట్లను కేటాయించామని.. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను నియమించినట్లు తెలిపారు.

ఇక, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే రైతులకు 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వడ్లకు 250 రూపాయలు బోనస్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు 500 రూపాయలు బోనస్‌గా ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని ఆతర్వాత అభివృద్ధి పైనే దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారిలో నమ్మకాన్ని పెంచుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల హామీలను ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి ప్రసంగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..