Telangana: ధర్మపురి స్ట్రాంగ్ రూంలో కీలక పత్రాలు స్వాధీనం.. ఈరోజు హైకోర్టుకు సమర్పించనున్న అధికారులు

ధర్మపురి ఎన్నికల వివాదం రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటోంది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం ఉదయం ధర్మపురి స్ట్రాంగ్ రూం తాళాలను అధికారులు పగలగొట్టారు. కట్టుదిట్టమైన భద్రతతో దాదాపు 200 మంది సిబ్బందితో 17 గంటల పాటు 17సీ ఫామ్‌ను పరిశీలించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Telangana: ధర్మపురి స్ట్రాంగ్ రూంలో కీలక పత్రాలు స్వాధీనం.. ఈరోజు హైకోర్టుకు సమర్పించనున్న అధికారులు
Strong Room

Updated on: Apr 24, 2023 | 7:55 AM

ధర్మపురి ఎన్నికల వివాదం రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటోంది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం ఉదయం ధర్మపురి స్ట్రాంగ్ రూం తాళాలను అధికారులు పగలగొట్టారు. కట్టుదిట్టమైన భద్రతతో దాదాపు 200 మంది సిబ్బందితో 17 గంటల పాటు 17సీ ఫామ్‌ను పరిశీలించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఈరోజు హైకోర్టుకు సమర్పించనున్నారు. ఈనెల 26న హైకోర్టు రీకౌంటింగ్ అంశాన్ని తేల్చనుంది. అయితే దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరిగందనడానికి ఇదే నిదర్శనమన్నారు. సీసీటీవీ ఫుటేజ్ అంశాన్ని కోర్టుకు నివేదిస్తానని స్పష్టం చేశారు.

2018లో జరిగిన ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( అప్పట్లో టీఆర్ఎస్) అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ 441 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇవాళ స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు తుది నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. అయితే ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..