
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడాన వానలు పడే అవకాశముంది.. తెలంగాణకు ఎల్లో అలెర్టు కూడా జారీ చేసింది. అలాగే రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు ఏపీలోను ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాల్లో వానలు పడొచ్చని అంచనా వేసింది.
పంజాబ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు తోడు ఎగువన ఉన్న డ్యామ్ ల నుంచి అదనపు నీటిని విడుదల చేయడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పంజాబ్‌లోని హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, బీఎస్‌ఎఫ్ బృందాలు చర్యలు చేపట్టాయి. భాక్రా, పాంగ్ డ్యాంల నుంచి అదనపు నీటిని విడుదల చేయడంతో ఈ మూడు జిల్లాల్లోని పెద్ద ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు తెలిపారు. డ్యామ్‌ల రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో బియాస్, సట్లెజ్ నదుల్లో నీటిమట్టం క్రమంగా పెరిగింది..అయితభారీ వర్షాల కారణంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలు వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
Daily Weather Briefing (English) 16.08.2023#imd #weather #Odisha #WestBengal #Jharkhand #Chhattisgarh #MadhyaPradesh #AndhraPradesh #telangana
YouTube : https://t.co/p2jcujFUwW
Facebook : https://t.co/5LFJ81u4g7@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/Wf8hjJ8JS4— India Meteorological Department (@Indiametdept) August 16, 2023
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 17, 2023
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 17, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..