Konda Vishweshwar Reddy: ‘అదంతా అసత్య ప్రచారం, నేను బీజేపీలోనే ఉంటా’.. పార్టీ మార్పుపై స్పందించిన మాజీ ఎంపీ..

|

May 20, 2023 | 8:59 PM

Konda Vishweshwar Reddy: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఓడించగల పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ, కమల దళం నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా..

Konda Vishweshwar Reddy: ‘అదంతా అసత్య ప్రచారం, నేను బీజేపీలోనే ఉంటా’.. పార్టీ మార్పుపై స్పందించిన మాజీ ఎంపీ..
Konda Vishweshwar Reddy
Follow us on

Konda Vishweshwar Reddy: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఓడించగల పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ, కమల దళం నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్టీ మారుతున్నానట్లు తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని.. భాజపాలోనే ఉంటానని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆయన మాట్లాడుతూ ‘బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది. బీజేపీ ఒక సిద్దాంతం ఉంది.. దానికే మా పార్టీ కట్టుబడి ఉంది. కొందరు నేతలు గెలిచిన తర్వాత తమ తమ పార్టీలను వీడి అధికార పార్టీలోకి వెళ్లారు. కానీ బీజేపీ నేతలు అలా చేయరు. బీజేపీ దేశంలోని అన్ని వర్గాల పార్టీ అయినప్పటికీ కొందరు ఉద్దేశ్యపూర్వకంగా మతత్వపార్టీ అని ముద్రవేశారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి అంతర్గత ఒప్పందం లేదు అని నిరూపించుకోవాలంటే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలని కొందరు మా పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. కవితను అరెస్టు చేయడం మా చేతుల్లో లేదు. చట్టం ఎప్పుడూ కూడా తన పనిని తానే చేస్తుంది. ఇటీవల వచ్చిన కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాలలో పెద్దగా ప్రభావం చూపవు’ అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి