మ్యాన్‌హోల్‌లో నలిగిపోయిన చిన్నారి.. అసలు బాధ్యులు ఎవరు..? క్లారిటిచ్చిన హైడ్రా కమిషనర్!

హైదరాబాద్‌ పాతబస్తీ యాకత్‌పురాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌ పడిపోయింది ఓ చిన్నారి. బాలిక తల్లి వెంటనే స్పందించడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బతికిపోయింది. అయితే మ్యాన్‌హోల్‌ ప్రమాదానికి బాధ్యులెవరు? జీహెచ్‌ఎంసీదా.. హైడ్రాదా.. లేక జలమండలిదా? దీనిపై ప్రశ్నిస్తూ వరుస కథనాలు ప్రసారం చేసింది టీవీ9. టీవీ9 వరుస కథనాలతో జీహెచ్‌ఎంసీ - హైడ్రా - జలమండలి మధ్య ఫైట్‌ మొదలైంది.

మ్యాన్‌హోల్‌లో నలిగిపోయిన చిన్నారి.. అసలు బాధ్యులు ఎవరు..? క్లారిటిచ్చిన హైడ్రా కమిషనర్!
Hyderabad Girl Falls In Open Manhole

Updated on: Sep 12, 2025 | 4:59 PM

యాకత్‌పురాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. యాకత్‌పురాలో మ్యాన్‌హోల్ తెరిచింది హైడ్రా సిబ్బందేనని తేల్చి చెప్పారు. మూత వేయడం మరిచిపోయింది హైడ్రా సిబ్బందేనన్నారు. ఆరేళ్ల పాప మ్యాన్‌హోల్‌లో పడడానికి కారణం హైడ్రానే అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ చేశామని, తప్పు హైడ్రా సిబ్బందిదేనని తేలిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు.

హైదరాబాద్‌ యాకత్‌పురాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌ పడిపోయింది ఓ చిన్నారి. బాలిక తల్లి వెంటనే స్పందించడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బతికిపోయింది. అయితే మ్యాన్‌హోల్‌ ప్రమాదానికి బాధ్యులెవరు? జీహెచ్‌ఎంసీదా.. హైడ్రాదా.. లేక జలమండలిదా? దీనిపై ప్రశ్నిస్తూ వరుస కథనాలు ప్రసారం చేసింది టీవీ9. టీవీ9 వరుస కథనాలతో జీహెచ్‌ఎంసీ – హైడ్రా – జలమండలి మధ్య ఫైట్‌ మొదలైంది. తప్పు మీదంటే మీదంటూ GHMC, హైడ్రా, జలమండలి మధ్య మాటల యుద్ధం జరిగింది.

హైడ్రా వల్లే ఈ తప్పు జరిగిందంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటూ నోటీసుల్లో హైడ్రాకి సూచించింది GHMC. అయితే, జలమండలి వల్లే ఆ తప్పు జరిగిందంటూ హైడ్రా కౌంటర్‌ ఇచ్చింది. దాంతో, జలమండలి రియాక్ట్‌ అయ్యింది. ఆ మ్యాన్‌హోల్‌ నిర్లక్ష్యానికి తమకు సంబంధం లేదంటూ జలమండలి ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు.

అయితే, ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ కావడంతో తప్పు తమదేనని ఒప్పుకుంది హైడ్రా. తమవల్లే తప్పు జరిగిందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ నిర్థారించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంతో మూత వేయడం మరిచిపోయింది హైడ్రా సిబ్బందేనన్నారు. ఆరేళ్ల పాప మ్యాన్‌హోల్‌లో పడడానికి కారణం హైడ్రానే అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేశామని, తప్పు హైడ్రా సిబ్బందిదేనని తేలిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..