Hyderabad: పాతబస్తీలో విషాదం.. ప్రేయసితో వీడియో కాల్‌ మాట్లాడుతూ ఉరేసుకున్న యువకుడు.. కారణమిదే

|

Nov 08, 2022 | 9:19 AM

ప్రేమించిన యువతితో వివాహం కాదేమోనన్న భయంతో ప్రేయసితో వీడియో కాల్‌ మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. పాతబస్తీ కాలాపత్తర్‌లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Hyderabad: పాతబస్తీలో విషాదం.. ప్రేయసితో వీడియో కాల్‌ మాట్లాడుతూ ఉరేసుకున్న యువకుడు.. కారణమిదే
mothers dead body
Follow us on

హైదరాబాద్‌ పాతబస్తీలో విషాదం చేసుకుంది. మనసిచ్చిన అమ్మాయితో మనువు కావట్లేదని ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాలతో ప్రేమించిన యువతితో వివాహం కాదేమోనన్న భయంతో ప్రేయసితో వీడియో కాల్‌ మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. పాతబస్తీ కాలాపత్తర్‌లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మహ్మద్ తబ్రేజ్‌ అలీ అనే యువకుడు స్థానికంగా నివాసముండే ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. వారి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారు. కొద్దిరోజుల్లోనే ఏం జరిగిందో ఏమో తెలియదుగాని.. రెండు కుటుంబాల మధ్య కలహాలు పెరిగిపోయాయి. పెళ్లికి బ్రేక్‌ పడింది. ఇదే క్రమంలో ప్రియుడు.. ప్రేయసికి వీడియో కాల్‌ చేశాడు. కాల్‌ మాట్లాడుతూ లైవ్‌లోనే ఉరేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని  పోస్టుమార్టం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

రైలు కిందపడి మరొకరు..

కాగా రైలు కిందపడి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే జీఆర్‌పీ ఇన్‌ఛార్జి కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం బానాజీపేటకు చెందిన భాస్కర్‌ (35) తన భార్య, మూడేళ్లలోపు ఇద్దరు పిల్లలతో కలిసి ఉప్పల్‌ పరిధిలోని చిలుకానగర్‌లో ఉంటున్నారు. సోమవారం సాయంత్రం హోండా స్కూటీపై బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ వరకు వచ్చిన ఆయన వాహనాన్ని అక్కడే పార్క్‌చేసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం వద్ద లభించిన మొబైల్‌ ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారమిచ్చారు. భాస్కర్‌ బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..