Hyderabad: అందమైన అమ్మాయితో గడిపే ఆఫర్.. ఆ యువకుడు చెలరేగిపోయాడు.. చివరకు

నా దగ్గర అందమైన ఫిగర్స్ ఉన్నారు.. కావాలంటే ఫోటోలు చూడు.. ఇంకా నమ్మకం కుదరకపోతే రివ్యూస్ చూస్కో అంటూ టెలిగ్రామ్‌లో టెమ్ట్ చేశాడు. దీంతో యువకుడు నిజమేనేమో అని ఆశపడ్డాడు. అందమైన అమ్మాయితో గడపాలని ఆశపెడితే.. చివరికి క్షవరమే అయింది. ..

Hyderabad: అందమైన అమ్మాయితో గడిపే ఆఫర్.. ఆ యువకుడు చెలరేగిపోయాడు.. చివరకు
Honeytrap Scam

Edited By:

Updated on: Dec 02, 2025 | 7:47 PM

టెలిగ్రామ్‌లో హనిట్రాప్‌ చేసి ఓ యువకుడిని పెద్ద మొత్తంలో మోసగించిన ఘటన నగరంలో వెలుగుచూసింది. యాకూత్‌పురాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ‘పెయిడ్ సర్వీస్’ పేరుతో కనిపించిన నకిలీ ప్రొఫైల్‌ను నమ్మి మొత్తం రూ.1,02,093లు కోల్పోయాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. స్కామర్‌ చాలా తెలివిగా బాదితుడ్ని బుట్టలో వేసుకున్నాడు. కళ్లు చెదిరే ఫోటోలు పెట్టాడు.. ఫేక్ రివ్యూలతో సర్వీస్ అదుర్స్ అన్నట్లు బిల్డప్ ఇచ్చుకున్నాడు. ఎడిట్ చేసిన చాట్ స్క్రీన్‌షాట్లు చూపించి తమ సర్వీస్‌ నిజమని నమ్మబలికాడు. తర్వాత అడ్వాన్స్, సెక్యూరిటీ, రూమ్ బుకింగ్, రిఫండబుల్ ఛార్జీలు అంటూ వరుస పేమెంట్స్ చేయించాడు. బాధితుడు యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ల ద్వారా అనేక ఖాతాలకు మొత్తం రూ.1.02 లక్షలు పంపేశాడు.

డబ్బులు పంపిన తర్వాత ‘అబిడ్స్‌లోని హోటల్‌కు రావాలి’ అంటూ మెసేజ్‌ పంపడంతో బాధితుడు అక్కడికి వెళ్లాడు. అయితే అక్కడ ఎవరూ రాకపోవడంతో మోసపోయినట్టు తెలిసింది. ఇదే సమయంలో స్కామర్‌ మరో రూ.10,000 ఇవ్వాలని బెదిరించడంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టెలిగ్రామ్, వాట్సాప్‌లలో కనిపించే ‘పెయిడ్ కంపానియన్‌షిప్’ ప్రొఫైల్‌లు అన్నీ మోసపూరితమే అని స్పష్టం చేశారు. స్కామర్లు ఫేక్ ఫొటోలు, నకిలీ రివ్యూలు, ఎడిటెడ్ స్క్రీన్‌షాట్లు ఉపయోగిస్తారని.. ప్రజలు ఎలాంటి తెలియని ప్రొఫైల్‌లను నమ్మరాదని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..