ఎకరం ధర రూ.150 కోట్లుకోకాపేట నియోపోలిస్‌లో రికార్డ్ బ్రేక్
రంగారెడ్డి జిల్లా కోకాపేట నియోపోలిస్‌లో జరిగిన HMDA భూముల ఈ-వేలంలో ఎకరం రూ.151.25 కోట్ల రికార్డు ధరకు అమ్ముడైంది. లక్ష్మీనారాయణ, గోద్రేజ్ సంస్థలు 9.06 ఎకరాలను రూ.1353 కోట్ల భారీ ఆదాయంతో సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని ఇది చాటుతోంది, భవిష్యత్ వేలంపై ఆసక్తిని పెంచుతోంది.
రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో మరోసారి భూములకు రికార్డు ధర లభించింది. నియోపోలిస్ లేఅవుట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన తాజా ఈ–వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.151.25 కోట్ల గరిష్టానికి చేరి సంచలనం సృష్టించింది. ఫ్లాట్ నంబర్లు 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాలకు జరిగిన ఈ వేలం ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం తెచ్చింది. ప్లాట్ నెం. 15 (4.03 ఎకరాలు)లో ఎకరాకు రూ.151.25 కోట్లు బిడ్ రాగా.. ప్లాట్ నెం.16 (5.03 ఎకరాలు)లో ఎకరా ధర రూ.147.5 కోట్ల వద్ద ఆగింది. మొత్తం మీద ఈ రెండు ప్లాట్ల ద్వారానే ప్రభుత్వం సుమారు రూ.1353 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా HMDA ముందుగా నిర్దేశించిన రూ.99 కోట్ల ప్రారంభ ధరను బిడ్డర్లు బాగా మించేలా పోటీ పడటం విశేషం. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు సాగింది. బిడ్డర్లు ధరను పరుగులు పెట్టించిన ఈ పోటీలో ప్లాట్–15ను లక్ష్మీనారాయణ కంపెనీ, ప్లాట్–16ను గోద్రేజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకున్నాయి. ఇదే లేఅవుట్‌లో ఈ నెల 24న 18వ ప్లాట్‌లో ఎకరాకు రూ.137.25 కోట్లు పలికిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సంఖ్యను 14 కోట్లు అధిగమించి కొత్త రికార్డు నమోదు అయింది. ఇదే నియోపోలిస్‌లోని 19, 20 నంబరు ప్లాట్లలో ఉన్న మరో 8 ఎకరాలకు డిసెంబర్ 3న వేలం జరగనుంది. ప్రతి బిడ్డర్ కనీసం రూ.5 కోట్ల అప్లికేషన్ భద్రతా డిపాజిట్ జమ చేయాలి. వేలంలో విజయం సాధిస్తే, ఒక వారం రోజుల్లో 25%, తదుపరి 60 రోజుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది అని హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇటీవలే హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రీమియం భూములను ఆన్‌లైన్ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆగస్టులో రాయదుర్గంలోని 7.67 ఎకరాలు రూ.1,357 కోట్లకు అమ్ముడవడం, ఎకరాకు ఏకంగా రూ.177 కోట్లు నమోదు కావడం పెద్ద సంచలనం. అదే ధోరణిలో కోకాపేటలో ఈసారి ప్లాట్లు 16 నుంచి 19 వరకూ 27 ఎకరాలు వేలానికి రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఎకరాకు రూ.150 కోట్లకుపైనే పలుకుతుందని భావించిన మార్కెట్ అంచనాలు యధార్ధమైపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
120 అడుగుల ఎత్తులో గాల్లో ఇరుక్కుపోయిన టూరిస్టులు.. ఏం జరిగిందంటే
అలాంటి స్లీపర్ బస్సులు రద్దు.. NHRC స్ట్రాంగ్ వార్నింగ్
సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల
బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు
తుని ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. యువకుడి కాలులో అది పెట్టేసి కుట్టేసారు..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

