AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో తొలిసారిగా ఆటోమేటిక్‌ స్మార్ట్ పార్కింగ్

హైదరాబాద్‌లో తొలిసారిగా ఆటోమేటిక్‌ స్మార్ట్ పార్కింగ్

Phani CH
|

Updated on: Dec 02, 2025 | 7:46 PM

Share

హైదరాబాద్‌లో వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆటోమేటెడ్, మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను ప్రారంభించింది. KBR పార్క్ వద్ద GHMC నిర్మించిన తొలి సేవలు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను నిలిపే ఈ వ్యవస్థ, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, నగరవాసులకు సౌలభ్యం కల్పిస్తుంది.

హైదరాబాద్ మహానగర వాసులను నిత్యం వేధిస్తున్న వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌కు శ్రీకారం చుట్టింది.హైదరాబాద్‌లో ఆటోమెటిక్‌ స్మార్ట్ పార్కింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అతి తక్కువ స్థలాన్ని ఉపయోగించుకోవడం దీని విశేషం. పార్క్ చేసిన కారు.. ఆటోమేటిక్ గా రొటేట్ అవుతూ మల్టీ లెవెల్ స్లాట్లలోకి చేరుకుంటాయి. నిర్దేశించిన స్లాట్ లోకి వాహనదారులు స్వయంగా వెళ్లి పార్క్ చేయాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్‌లో KBR పార్క్ దగ్గర GHMC నిర్మించిన మొదటి ఆటోమెటిక్ స్మార్ట్ పార్కింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.నవ నిర్మాణ్ ప్రైవేటు సంస్థ ఈమల్టీ లెవెల్ కార్ పార్కింగ్‌ను రూపొందించింది. పార్క్‌లో వాకింగ్‌కు వచ్చేవారికి పార్కింగ్‌ సదుపాయం లేకపోవడంతో రోడ్డుపై వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తెలెత్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలు దృష్ట్యా జూబ్లీ చెక్‌పోస్టుకు సమీపంలో 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈపార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆటోమెటిక్‌ స్మార్ట్ పార్కింగ్ పై మరింత సమచారం మా కరస్పాండెంట్ శ్రీధర్‌ అందిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలాంటి స్లీపర్ బస్సులు రద్దు.. NHRC స్ట్రాంగ్ వార్నింగ్

సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల

బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు

తుని ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. యువకుడి కాలులో అది పెట్టేసి కుట్టేసారు..

కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? పెళ్లిలో యువతుల హడావుడి.. చివరికి