Hyderabad: ప్రపంచంలోనే మొట్టమొదటి ‘టీ’ ఏటీఎమ్‌.. ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే..

హైదరాబాద్‌ మరో అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. ప్రపంచంలోనే తొలి టీ, కాఫీ, వాటర్‌ ఆటోమేటిక్‌ వెండింగ్ మెషిన్‌ను ప్రాంరభించారు. పూర్తిగా ఆటోమెటెడ్‌గా పనిచేసే ఈ మిషిన్‌ను గురువారం నగరంలో మొదలు పెట్టారు. మెషిన్‌పై ఉండే QR కోడ్‌ని స్కాన్‌ చేయడం ద్వారా మీకు కావాల్సిన వస్తువులను సెలక్ట్ చేసుకోవచ్చు...

Hyderabad: ప్రపంచంలోనే మొట్టమొదటి టీ ఏటీఎమ్‌.. ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే..
Tea ATM

Updated on: Jun 16, 2023 | 7:42 AM

హైదరాబాద్‌ మరో అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. ప్రపంచంలోనే తొలి టీ, కాఫీ, వాటర్‌ ఆటోమేటిక్‌ వెండింగ్ మెషిన్‌ను ప్రాంరభించారు. పూర్తిగా ఆటోమెటెడ్‌గా పనిచేసే ఈ మిషిన్‌ను గురువారం నగరంలో మొదలు పెట్టారు. మెషిన్‌పై ఉండే QR కోడ్‌ని స్కాన్‌ చేయడం ద్వారా మీకు కావాల్సిన వస్తువులను సెలక్ట్ చేసుకోవచ్చు. పి. వినోద్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ ఆటోమేటెడ్‌ వెండింగ్ మెషీన్‌ను రూపొందించారు.

ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సాధారణ ప్రజలకు వెండింగ్ మెషీన్లు అందుబాటులో లేవు, ఇండియాలో 100 మాల్స్‌లో కేవలం ఒక మిషన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. బ్యాంకు రుణంతో పాటు బీమా సౌకర్యంతో ఈ మిషిన్స్‌ను అందుబాటులోకి తీసుకునున్నారు. రిఫ్రిజిరేట్‌ కంటే తక్కువ ధరకే ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాము’ అని చెప్పుకొచ్చారు. జెమ్‌ ఓపెన్‌ క్యూబ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ రూపొందిచిన ఈ మిషన్‌ ప్రంపంచలో తొలి టీ ఆటోమేటిక్‌ వెండింగ్‌ మెషీన్‌గా పేరు తెచ్చుకుంది.

హైటెక్‌ సిటీలోని అవాసా హోటల్‌లో నిర్వహించిన మెషిన్‌ ప్రారంభోత్సవానికి ఎంపీ రంజిత్‌ రెడ్డి, సిటీ నటుడు మంచచు మనోజ్‌తో పాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మెషిన్స్‌ ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని వినోద్ కుమార్‌ చెబుతున్నారు. వినోద్‌ కుమార్‌ ఆవిష్కరణను ప్రముఖులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..