AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మద్యం తాగించి ఆపై.. నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలిపై..

దీంతో చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డికి పార్టీ ఇవ్వడానికి ఆహ్వానించింది. వీరిద్దరూ పాఠశాల స్నేహితులు కావడంతో ఆ స్నేహంతోనే పార్టీకి పిలిచింది. దీంతో సోమవారం రాత్రి వీరిద్దరూ కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓంకార్‌ నగర్‌ కాలనీలోని బొమ్మరిల్లు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించి, భోజనం చేశారు...

Hyderabad: మద్యం తాగించి ఆపై.. నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలిపై..
Hyderabad
Narender Vaitla
|

Updated on: Jul 31, 2024 | 8:26 AM

Share

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. అలాగే మరో స్నేహితుడితో కలిసి కూడా దాడి చేశాడు. ఈ హేహమైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌కు చెందిన ఓ యువతికి ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. ల

దీంతో చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డికి పార్టీ ఇవ్వడానికి ఆహ్వానించింది. వీరిద్దరూ పాఠశాల స్నేహితులు కావడంతో ఆ స్నేహంతోనే పార్టీకి పిలిచింది. దీంతో సోమవారం రాత్రి వీరిద్దరూ కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓంకార్‌ నగర్‌ కాలనీలోని బొమ్మరిల్లు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించి, భోజనం చేశారు.

అయితే ఆ తర్వాత అదే రెస్టారెంట్‌లో గౌతంరెడ్డి గదిని అద్దెకు తీసుకొని యువతిని గదికి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడిని కూడా గదికి పిలిపించుకొని ఇద్దరు కలిసి యువతిపై దాడికి పాల్పడ్డారు. అయితే మద్యం మత్తునుంచి తేరుకున్న యువతి తనపై లైంగిక దాడి జరింగిందన్న విషయం అర్థమై గట్టిగా కేకలు వేసింది.

దీంతో కంగారు పడ్డ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత యువతి జరిగిన విషయాన్ని రెస్టారెంట్ యాజమాన్యానికి వివరించగా.. ఆమె స్నేహితులకు సమాచారం అందించారు. రెస్టారెంట్‌కు చేరుకున్న యువతి స్నేహితలు.. తనను తీసుకెళ్లి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు గౌతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో నిందితుడి కోసం వెతుకుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్