Hyderabad: రమ్మంటూ వేధిస్తున్నాడు.. ఓ పార్టీ నాయకుడిపై మహిళ సంచలన ఆరోపణలు..

Kukatpally: హైదరాబాద్‌లోని ఓ పార్టీ నాయకుడు తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.  ఓ ఎమ్మెల్యే అనుచరుడి లైంగిక వేధింపులతో

Hyderabad: రమ్మంటూ వేధిస్తున్నాడు.. ఓ పార్టీ నాయకుడిపై మహిళ సంచలన ఆరోపణలు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 19, 2022 | 11:59 AM

Kukatpally: హైదరాబాద్‌లోని ఓ పార్టీకి చెందిన నాయకుడు తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.  ఓ ఎమ్మెల్యే అనుచరుడి లైంగిక వేధింపులతో తాను మానసిక వేదనకు గురవుతున్నానని.. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం (Hyderabad) సైబరాబాద్ సీపీ కార్యాలయంలో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో నివసించే బాధితురాలు గతంలో వసంతనగర్‌లో ఉంటూ బోటిక్ నడిపేది. ఆమె ఇంటిపక్కనే ఉన్నవారు ఓ భవన నిర్మాణం చేపట్టిన క్రమంలో ఇంటి గేట్ ముందు కార్లు నిలపడం, బిల్డింగ్ సామగ్రి ఉంచడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తొలగించాలంటూ సూచించింది. దీంతో ఓ పార్టీకి కో ఆర్డినేటర్ గా ఉన్న  నాయకుడి డ్రైవర్ తనను నోటికి వచ్చిన విధంగా బూతులు తిట్టాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

అనంతరం పార్టీకి కూకట్‌పల్లి కో ఆర్డినేటర్ ఉన్న వ్యక్తి  తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని పేర్కొంది. తాను ఎక్కడికి వెళితే అక్కడ మనుషులను పెట్టించి తిట్టిస్తున్నాడండటూ తెలిపింది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడని.. పోలీసులతో, థర్డ్ జెండర్స్ తో కూడా బెదిరింపులకు గురిచేసినట్లు తెలిపింది. తనతో గడపాలంటూ వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. ఎస్సై సైతం అవమానకరంగా మాట్లాడారని, కేసులు పెడతామంటూ బెదిరించారని పేర్కొంది. తన ఫోన్ తీసుకుని రెండు రోజుల వరకు ఇవ్వలేదని ఆరోపించింది. అతని నుంచి  తనకు ప్రాణహాని ఉందని, తనను, తమ కుటుంబాన్ని రక్షించాలంటూ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

Also Read:

Viral Video: అచ్చం మనుషుల్లానే..! పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఎలుకలు.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే

Viral Video: భార్యాభర్తల పంచాయితీ..! మంచం మీద సీన్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!