Hyderabad: వామ్మో.. హైదరాబాద్‌లో మాయ లేడి.. లిఫ్ట్ అడిగిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా..?
హైదరాబాద్‌లో ఓ కిలాడి లేడి పురుషులను తెగ ఆడుకుంటుంది.. అమాయకపు చూపులతో రోడ్డుమీద నిల్చుని లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కుతుంది.. ఆ తర్వాత వేలకు వేలు సంపాదిస్తుంది ఈ మాయ లేడి. లిఫ్ట్ అడిగి దర్జాగా కూర్చున్న తర్వాత.. అసలు ప్లాన్ మొదలుపెడుతుంది.. తనపై లైంగిక దాడి చేశారంటూ ఆరోపణ చేస్తూ డ్రైవర్ లను మభ్యపెడుతూ ప్రతిరోజు వేలకు వేలు సంపాదిస్తూ పబ్బం గడుపుతుంది..

హైదరాబాద్‌లో ఓ కిలాడి లేడి పురుషులను తెగ ఆడుకుంటుంది.. అమాయకపు చూపులతో రోడ్డుమీద నిల్చుని లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కుతుంది.. ఆ తర్వాత వేలకు వేలు సంపాదిస్తుంది ఈ మాయ లేడి. లిఫ్ట్ అడిగి దర్జాగా కూర్చున్న తర్వాత.. అసలు ప్లాన్ మొదలుపెడుతుంది.. తనపై లైంగిక దాడి చేశారంటూ ఆరోపణ చేస్తూ డ్రైవర్ లను మభ్యపెడుతూ ప్రతిరోజు వేలకు వేలు సంపాదిస్తూ పబ్బం గడుపుతుంది.. ఈ లేడి కిలాడీ అసలు పేరు సయిదా నయీమా సుల్తానా (32).. ఈమె కేవలం లిఫ్ట్ పేరుతో పురుషులను దోచేస్తుంది.. సాధారణంగా మహిళ లిఫ్ట్ అడగగానే సానుభూతితో చాలామంది లిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటివారిని టార్గెట్ చేస్తుంది ఈ మాయ లేడి. ప్రధాన జంక్షన్లో వద్ద రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది.. కొద్దిసేపటికే తన బట్టలు మొత్తం చింపుకొని డ్రైవర్ ను డబ్బులు ఇవ్వలని డిమాండ్ చేస్తుంది. తాను ఇవ్వను అని చెబితే తనను డ్రైవర్ రేప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తుంది.
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు.. అలానే పలు రూట్లలో ప్రతి రోజు ఇలానే చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది.. అయితే, రెండు రోజుల క్రితం కూడా ఇదే తరహాలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. కార్ ఎక్కిన వెంటనే వెనకాల సీట్లో కూర్చుని తన బట్టలు మొత్తం చింపుకుంది. ఎక్కడికి వెళ్లాలి అని అడగ్గానే, కారు ఇక్కడితో ఆపేసేయలని దిగేస్తూ తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఇవ్వాలి అని డ్రైవర్ అడగగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ గొడవ చేసింది.. తాను పోలీసులకి ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే తనకు కొంత డబ్బు చెల్లించాలని డ్రైవర్ ను బెదిరించింది. దీంతో అవాక్కైన డ్రైవర్ కారును నేరుగా ఎక్కడ ఆపకుండా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు. కార్ లాక్ చేసి లోపల ఉన్న పోలీసులను తీసుకొచ్చి ఆ లేడీ ని పోలీసులకు అప్పగించాడు.

Hyderabad Crime News
అయితే, నిందితురాలిని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. గతంలోనూ ఇదే తరహా కేసులలో ఈ లేడి కిలాడీ నిందితురాలిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లోనే ఇలాగే డ్రైవర్ను దోచుకునేందుకు ప్రయత్నించిన కేసులో పోలీసులు నిందితురాలని అరెస్టు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లోను ఈ లేడీ పై కేసు ఉన్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. ఈ విధంగా మొత్తం నగర వ్యాప్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో 17 కేసులు ఈ మాయలేడిపై ఉన్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సుల్తానా ను రిమాండ్ కు తరలించారు. కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు సుల్తానాను చెంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అయితే గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడటంతో సుల్తానాపై పిడి యాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సుల్తానాను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 17 కేసుల్లో సుల్తానా నిందితురాలుగా ఉండటంతో.. ఆమెను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
