Wines Close: మందు బాబులకు అలర్ట్‌.. ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌..

అయితే స్టార్ హోటళ్లు, రిజిస్ట్రర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే హోలి రోజు రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన, బైక్‌లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. అలాగే రోడ్లపై తెలియని వ్యక్తులు రంగులు...

Wines Close: మందు బాబులకు అలర్ట్‌.. ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌..
Wines

Updated on: Mar 23, 2024 | 3:45 PM

కొన్ని సందర్బాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అధికారులు వైన్స్‌ బంద్‌ చేస్తుంటారు. ముఖ్యంగా వేడుకలు కొన్ని రకాల పండుగల సమయంలో వైన్స్‌ను మూసేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా హోలీ పండగ నేపథ్యంలో వైన్స్‌ బంద్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన హోలీ పండుగను పురస్కరించుకొని వైన్‌ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఇప్పటికే అబ్కారీ శాఖకు, పోలీసు శాఖకు అధికారులు సమాచారం అందించారు. ఏయే ప్రాంతాల్లో ఏ రోజు వైన్స్‌ బంద్‌ ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్, రాచకొండ పరిధిలోని అన్ని వైన్స్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మూత పడనున్నాయి. హోలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ కమిషనర్‌ ఇచ్చి డ్రైడే నోటిఫికేషన్ ఆధారంగా ఆదివారం (24-03-2024) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం (26-03-2024) ఉదయం 6 గంటల వరకు వైన్స్‌లు, బార్లు, కల్లు దుకాణాలను మూసి వేయనున్నారు. అదే విధంగా సైబరాబాద్ పరిధిలో 25 సోమవారం ఉదయం 6:00 గంటల నుంచి మంగళవారం (26-03-2024) ఉదయం 6 గంటల వరకు వైన్స్‌లు మూసివేయనున్నారు.

అయితే స్టార్ హోటళ్లు, రిజిస్ట్రర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే హోలి రోజు రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన, బైక్‌లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. అలాగే రోడ్లపై తెలియని వ్యక్తులు రంగులు పూయడం, రోడ్లపై హోలీ వేడుకలు చేసినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..