Hyderabad: మసాజ్ పార్లర్స్‌పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు.. 34 మంది అదుపులోకి..

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 15, 2023 | 9:25 AM

Hyderabad News: హైదరాబాద్‌లో అనుమతి లేకుండా నడుపుతున్న మాసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయా మసాజ్ పార్లర్స్‌కి లైసెన్స్, సీసీ కెమెరాలు, కస్టమర్ల ఎంట్రీ రిజిస్టర్‌ లేవని పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ దాడుల్లో భాగంగా..

Hyderabad: మసాజ్ పార్లర్స్‌పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు.. 34 మంది అదుపులోకి..
Spa Centre Organisers
Follow us on

Hyderabad News: హైదరాబాద్‌లో అనుమతి లేకుండా నడుపుతున్న మాసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయా మసాజ్ పార్లర్స్‌కి లైసెన్స్, సీసీ కెమెరాలు, కస్టమర్ల ఎంట్రీ రిజిస్టర్‌ లేవని పోలీసులు గుర్తించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 10 మసాజ్ పార్లర్ల దాడులు చేసి మొత్తం  34 మందిని టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అక్రమంగా మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు.

GHMC నుంచి లైసెన్స్ పొందకపోవడం, ప్రొఫెషనల్ థెరపిస్ట్‌లు లేకపోవడం, CCTV కెమెరాల DVR లేకపోవడం, ముఖ్యంగా మసాజ్ రూమ్‌లలో CCTV కెమెరాలు లేకపోవడం, ఇంకా మార్గదర్శకాలు లేకుండా మహిళతో వినియోగదారులకు క్రాస్ మసాజ్‌లు చేస్తూ చట్టవిరుద్ధమైన పనులకు ఆయా స్పా సెంటర్స్‌ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఆయా సెంటర్లను సీజ్ చేసి నిందితులను జైల్‌కి తరలించారు

కాగా, అర్హత కలిగిన వైద్యులు లేని.. ఫిజియోథెరపిస్ట్, కస్టమర్ల ఎంట్రీ రిజిస్టర్‌ను పాటించని మసాజ్ సెంటర్స్‌పై చర్యలు తప్పవని నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. ఇంకా చట్టవిరుద్ధమైన మసాజ్ పార్లర్ల సమాచారాన్ని తమకు తెలియజేయాలని నగర పౌరులను అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..