
నగరంలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జలమండలి ఓ అండ్ ఎం నెం. 10బి, ప్రశాంత్ నగర్ పరిధిలోని ఆటో నగర్ రిజర్వాయర్ ఔట్ లెట్ మెయిన్ 1000 ఎంఎం డయా పైపులైనుకు ఆటో నగర్ నుంచి నాగోల్ వరకు నాలుగు ప్రాంతాల్లో లీకేజీలకు అడ్డుకట్ట వేయనున్నారు. ఇందులో భాగంగానే లీకేజీలను ఆరికట్టడానికి పైపులైనుకు అత్యవసరంగా మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంది. మరమ్మత్తుల నేపథ్యంలో గురువారం (17-11-2022) ఉదయం 4 గంటల నుంచి శుక్రవారం (18-11-2022) ఉదయం 4 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
దీంతో 24 గంటలపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఉప్పల్ మెట్రో రైల్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, దేవేందర్ నగర్, రామంతపూర్ దేవేందర్ నగర్లో రెండు వాంబే హౌసింగ్ కాంప్లెక్స్లు, CDFD, శ్రీ సాయి RTC కాలనీ, ఆదర్శనగర్, వెంకట్ సాయి నగర్, శ్రీ కృష్ణ కాలనీ, ఓల్డ్ పీర్జాదిగూడ, మల్లికార్జున నగర్ ఫేస్ I & II, భవానీ నగర్ కాలనీలు, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, పెద్దఅంబర్పేట్, గౌరెల్లి మరియు కుత్బుల్లాపూర్, ఎన్టీఆర్ నగర్ బస్తీ, వాస్తు కాలనీ, RTC కాలనీ, శివ గంగా కాలనీ, శిరి రోడ్, శ్రీనివాస కాలనీ, శివమ్మ బస్తీ, నాగోల్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..