Hyderabad: ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో విషాదం..చికిత్స పొందుతూ బాధితుడు శ్రీనివాస్‌ మృతి..

|

Apr 02, 2022 | 11:13 AM

Warangal MGM Hospital: వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో విషాదం జరిగింది. బాధితుడు శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Hyderabad: ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో విషాదం..చికిత్స పొందుతూ బాధితుడు శ్రీనివాస్‌ మృతి..
Follow us on

Warangal MGM Hospital: వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో విషాదం జరిగింది. బాధితుడు శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వారం క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో ఎంజీఎంలో చేరాడు శ్రీనివాస్‌. అక్కడి అధికారులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శ్రీనివాస్‌ను ఎలుకలు కొరుక్కుతినడంతో తీవ్రరక్తస్రావం అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను నిన్న (ఏప్రిల్‌1) హైదరాబాద్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ చికిత్సకు సహకరించిక పోవడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీనివాస్‌ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ప్రభుత్వం సీరియస్..

కాగా హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ కొంతకాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ కూడా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు శ్రీనివాస్ ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఇదిలా ఉండగానే గత నెల31వ తేదీన ఎలుకల దాడిలో శ్రీనివాస్ కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచనల మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు శ్రీనివాస్ ను ఎంజీఎం నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ వైద్యులు ఆయన్ను వైద్యులు రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ (ఆర్ఐసీ)లో ఉంచి మెరుగైన చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు.. పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్​గా తీసుకొంది. వరంగల ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది. మరో ఇద్దరు డాక్టర్ల పైనా కఠిన చర్యలు తీసుకుంది.

Also Read:Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఇబ్బందులు తీర్చేందుకు సరికొత్త ఫీచర్Horoscope Today: ఈరాశివారికి శుభ ఘడియలు.. ఉగాది రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Copying: పరీక్షలో కాపీ కొడుతూ అడ్డంగా బుక్కైన విద్యార్థి.. కసితీరా కొరికిన లెక్చరర్.. ఎక్కడంటే..