Viral Video: బిగ్‌బాస్ షో చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. ఆ తర్వాత సీన్ ఇదే..! వీడియో వైరల్
Bus Driver Caught Watching 'Bigg Boss' while driving at night: మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో నడి రోడ్డుపై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. ఇందులో డ్రైవర్‌తో సహా మొత్తం 19 మంది సజీవగా దహనమయ్యారు. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. డ్రైవర్ ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా వారి ప్రాణాలు కాపడగలిగేవాడు. ఇక ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే తెలంగాణ చేవెళ్లలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో

రోడ్లపై ప్రమాదాలు ఈ మధ్య కాలంలో మరింత పెరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో నడి రోడ్డుపై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. ఇందులో డ్రైవర్‌తో సహా మొత్తం 19 మంది సజీవగా దహనమయ్యారు. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. డ్రైవర్ ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా వారి ప్రాణాలు కాపడగలిగేవాడు. ఇక ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే తెలంగాణ చేవెళ్లలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో ఏకంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తప్పెవరిదైనా బస్సులో నిద్రలో ఉన్న ప్రయాణికులు కళ్లు తెరచి ఏం జరిగిందో తెలుసుకునేలోపు అంతా ముగిసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఇటీవల పెరిగిన బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నా డ్రైవర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలింతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఈ వీడియోలో ఓ బస్సు డ్రైవర్ రాత్రిపూట చిమ్మ చీకట్లో బస్సు నడుపుతూ తన ఫోన్‌లో బిగ్‌బాస్ షో చూడటం కనిపిస్తుంది. ఓ వైపు బస్సును హైస్పీడ్‌తో నడుపుతూ ఫోన్‌లో డ్రైవర్ వీడియో చూస్తుండటం కనిపిస్తుంది. సదరు బస్సు ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బస్సు డ్రైవర్ ఓ చేత్తో స్టీరింగ్ పట్టుకుని తిప్పుతూ.. మరో చేత్తో ఫోన్ పట్టుకుని బిగ్‌బాష్ షో చూస్తూ కనిపించాడు. ఆ సమయంలో బస్సు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లం కూడా వీడియోలో కనిపిస్తుంది.
Big Boss is injurious to life & family😱pic.twitter.com/HzpHJE782N
— Vije (@vijeshetty) November 8, 2025
ఇక అదే బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు డోర్ వద్దకు వెళ్లి, డ్రైవర్ భాగోతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత గురించి ఏ మాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్న సదరు బస్సు డ్రైవర్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ ఘటన అక్టోబర్ 27న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




