Hyderabad: వందే భారత్ రైళ్లపై పెరిగిన రాళ్ల దాడులు.. ఆమె సెల్ఫీ తీసుకుంటూ పడింది.. కానీ..

ఈ ఏడాది వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం పెరిగిందని జీఆర్‌పీ ఎస్పీ చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వే వార్షిక మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వందే భారత్ రైళ్లపై రాళ్ల రువ్వడం పెరిగినా, 2025లో రైల్వే నేరాల సంఖ్య మొత్తంగా తగ్గినట్లు తెలిపారు. GRP సికింద్రాబాద్ పరిధిలో వివిధ నేరాలు, రక్షణ చర్యలు, సాంకేతిక ప్రయోగాలపై వివరాలను వెల్లడించారు.

Hyderabad: వందే భారత్ రైళ్లపై పెరిగిన రాళ్ల దాడులు.. ఆమె సెల్ఫీ తీసుకుంటూ పడింది.. కానీ..
Vande Bharat Express

Edited By:

Updated on: Dec 31, 2025 | 6:16 PM

ఈ ఏడాది వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం పెరిగిందని జీఆర్‌పీ ఎస్పీ చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వే వార్షిక మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వందే భారత్ రైళ్లపై రాళ్ల రువ్వడం పెరిగినా, 2025లో రైల్వే నేరాల సంఖ్య మొత్తంగా తగ్గినట్లు తెలిపారు. GRP సికింద్రాబాద్ పరిధిలో వివిధ నేరాలు, రక్షణ చర్యలు, సాంకేతిక ప్రయోగాలపై వివరాలను వెల్లడించారు. గతేడాది 2835 కేసులు నమోదైనా, ఈ సంవత్సరం 2607 కేసులకు తగ్గాయి. 500 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. 629 మంది ప్రమాదాల్లో, 529 మంది ఆత్మహత్యలతో మొత్తం 1317 మంది మరణించారు.

NDPS యాక్ట్ కింద 54 కేసులు,70 అరెస్టులు, 817 కేజీల డ్రై గంజా సీజ్ చేసినట్లు తెలిపారు. ఆస్తి రికవరీ, సాంకేతిక చర్యలుప్రాపర్టీ లాస్ పెరిగినా రికవరీ కూడా ఎక్కువైంది. CEIR ద్వారా 1322 ఫోన్లు తిరిగి అందజేశారు. జీరో FIRలు 24 గంటల్లో రీ-రిజిస్టర్ చేస్తున్నారు. ఇండియన్ క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ తయారు చేసి, నేరస్తుల గుర్తింపును సులభతరం చేశారు.

మాదకద్రవ్యాలు, భద్రతా ప్రయోగాల కింద 7.26 కోట్ల విలువైన మత్తు పదార్థాలు ధ్వంసం చేశారు, 256 కేసులు డిటెక్ట్ చేశారు. కొత్త రైల్వే స్టేషన్లలో RPF, GRP సంయుక్త పరిశీలనలు, సీసీటీవీల్లో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అమలు చేశారు.139 హెల్ప్‌లైన్‌కు కాల్ వచ్చిన 10 నిమిషాల్లో సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

ముఖ్య ఘటనలు, మౌలిక సౌకర్యాలు MMTS ఘటన తప్పుడు FIRగా తేలింది.. బాధితురాలు సెల్ఫీలు తీసుకుంటూ పడినట్టు వెల్లడించారు. శంకర్‌పల్లి ట్రాక్‌పై కారు నడిపిన మహిళకు మతిస్థిమితం లేదని తెలిపారు. నవ దంపతుల గొడవ తర్వాత ఆత్మహత్య. GRP పరిధిలో 4 మర్డర్ కేసులు, 1 కన్విక్షన్ (2024లో జీరో). లోక్ అదాలత్‌లో 133 కేసులు రాజీ. కేసు డిటెక్షన్ రేటు 10% పెరిగినట్లు చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వేలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పెరిగిందని.. సాంకేతికత వినియోగంలో సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..