TSRTC: నిరుద్యోగ యువతకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ సేవలపై 20 శాతం రాయితీ..

|

May 01, 2022 | 6:53 AM

TSRTC News: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వినూత్న ఆఫర్లు, పథకాలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వీసీ సజ్జనార్‌ (VC Sajjanar).

TSRTC: నిరుద్యోగ యువతకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ సేవలపై 20 శాతం రాయితీ..
Tsrtc Md Sajjanar
Follow us on

TSRTC News: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వినూత్న ఆఫర్లు, పథకాలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వీసీ సజ్జనార్‌ (VC Sajjanar). అదేవిధంగా ఉద్యోగులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు. తాజాగా తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఆయన శుభవార్త చెప్పారు. సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్ పాస్‌లపై 20శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలలపాటు ఈ సేవలను కొనసాగిస్తామని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. బస్‌పాస్‌ల కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు ఆధార్ కార్డు జిరాక్స్, కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన గుర్తింపు కార్డు జిరాక్స్ లేదా నిరుద్యోగ గుర్తింపు కార్డులలో ఏదో ఒకదాన్ని బస్‌పాస్‌ తీసుకునే సమయంలో అందజేయాలని ఆర్టీసీ తెలిపింది. కాగా మూడు నెలలకు గాను ప్రస్తుతం ఆర్డినరీ బస్‌పాస్‌లకు రూ.3,450 వసూలు చేస్తున్నారు. 20శాతం సబ్సిడీ పోగా రౌండప్ చేసి రూ.2,800 వసూలు చేయనున్నారు. అదే విధంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతం రూ.3,900 వసూలు చేస్తున్నారు. 20శాతం రాయితీపై రౌండప్‌ చేసి రూ.3,200 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

సేవల కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌..

దీంతో పాటు టీఎస్‌ఆర్టీసీ సేవలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా నూతన కాల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. 040-2345-0033, 040-6944-0000 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 24 గంటల పాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ సూచించింది. రిజర్వేషన్ రద్దుకు సంబంధించిన నగదు, బస్సుల టైమింగ్స్‌ వివరాలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

AP Crime News: అంతా మాయ..! సత్తుపల్లి టు సత్తెనపల్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం..

Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయంటే..!

PM Narendra Modi: ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. 3 రోజుల్లో 3 దేశాలు, 25 సమావేశాల్లో ఫుల్ బిజీ..