సీఎస్ సోమేష్‌కుమార్‌తో పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ భేటీ.. ఏం చర్చించి ఉంటారు..?

తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నివేదించిన అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్తానని..

సీఎస్ సోమేష్‌కుమార్‌తో పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ భేటీ.. ఏం చర్చించి ఉంటారు..?
Follow us
K Sammaiah

|

Updated on: Jan 22, 2021 | 4:58 PM

తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నివేదించిన అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కోరినట్టుగా పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

శుక్రవారం పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బిఆర్ కెఆర్ భవన్ లో కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు చేపడుతున్న అభివృద్ధి లో పోలీస్ సిబ్బంది కీలకమైన బాధ్యతను పోషిస్తున్నారన్నారు.

తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని సోమేష్‌కుమార్‌ తెలిపారు. అసోసియేషన్ సభ్యులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని సోమేశ్‌కుమార్‌ చెప్పారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజి (L&O) శ్రీ జితేందర్ లు పాల్గొన్నారు.