PV Narasimharao : పీవీ చరిత్ర భావితరాలకు అందించాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పం…మంత్రి శ్రీనివాస్ గౌడ్…
మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు చరిత్ర భావితరాలకు అందించాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు చరిత్ర భావితరాలకు అందించాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పీవీ తెలంగాణోడు కావడం మనకెంతో గర్వకారణమని, పీవీ స్మృతులు, జ్ఞాపకాలతో ప్రత్యేక మ్యూజియం, థీమ్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. దేశానికి పీవీ ఎంతో సేవ చేశారని, ఎన్నో సంస్కరణలు తెచ్చారని వెల్లడించారు.
15 రోజుల్లో భూమి పూజ…
15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదికకు భూమిపూజ చేస్తామని, పీవీ స్వగ్రామంలో టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. వంగరలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జీఓ కాపీని కేకేకు మంత్రి అందించారు. కాగా, రూ.7 కోట్లతో పీవీ స్వస్థలం వంగరలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.