రామమందిర నిర్మాణానికి భారీగా విరాళాలు.. మై హోమ్ గ్రూప్‌ రూ. 5కోట్లు, మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 6కోట్లు

రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాగా.. దాతల నుంచి భారీగా విరాళాలు చేరుతున్నాయి.

రామమందిర నిర్మాణానికి భారీగా విరాళాలు.. మై హోమ్ గ్రూప్‌ రూ. 5కోట్లు, మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 6కోట్లు
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 22, 2021 | 6:28 PM

Huge Donations to Ayodhya Ram Mandir : ఆయోధ్యలోని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు రామాలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాగా.. దాతల నుంచి భారీగా విరాళాలు చేరుతున్నాయి. ఇందులో భాగంగా మై హోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ.5కోట్లు, మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ.6కోట్లు, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ తరుపున రూ.2కోట్లు డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ తరుపున రూ.కోటి విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో మై హోమ్స్ గ్రూప్స్ డైరెక్టర్లు జూపల్లి రాము రావు, జూపల్లి శ్యామ్ రావు, జూపల్లి రంజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషీ, మరో ఆర్ఎస్ఎస్ నేత భాగయ్యకు చెక్కుల రూపంలో అందించి భక్తిని చాటుకున్నారు. ఫిబ్రవరి 27 వరకు సాగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలు సేకరించనున్నట్లు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది.

Read Also… స్వదేశీ నిధులతోనే శ్రీరాముడి గుడి నిర్మాణం.. కీలక నిర్ణయం తీసుకున్న శ్రీరామ జన్మభూమి ట్రస్ట్