AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Rules: వాహనదారులకు అలెర్ట్.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ ఫైన్ పడుద్ది.. సోమవారం నుంచే ట్రాఫిక్ పోలీసుల స్పెష‌ల్ డ్రైవ్

ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా జరిగే ప్రాంతాల ఆధారంగా జరిమానా విధిస్తామని, రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు ప్రధాన కారణమైన యు-టర్న్‌లను సమీక్షించి తగిన సవరణలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ జరిమానా ప్రభుత్వానికి..

Traffic Rules: వాహనదారులకు అలెర్ట్..  ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ ఫైన్ పడుద్ది.. సోమవారం నుంచే ట్రాఫిక్ పోలీసుల స్పెష‌ల్ డ్రైవ్
Hyderabad Traffic Police
Sanjay Kasula
|

Updated on: Nov 27, 2022 | 9:46 PM

Share

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ కొత్తవేం కాకపోయినా వాటిని మరింత కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. అప్పుడే వాహన వినియోగదారుల ప్రవర్తనలో మార్పు వస్తుందని, తద్వారా నగర రహదారులు అందరికీ సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా రాంగ్ రూట్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్ రైడింగ్‌ ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై సోమ‌వారం నుంచి స్పెషల్‌ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా భారీగా ఫైన్లు వేసేందుకు సిద్ధమవుతున్నా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు. రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ వేయనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.

ఈ నెల 28 నుంచి రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులెవ్వరూ లేరు కదా అని ఇష్టానుసారంగా వాహనం నడిపినా.. ఎవరూ చూడడం లేదని నిబంధనలకు విరుద్ధంగా సిగ్నల్స్‌ జంప్‌ చేసినా సీసీ కెమెరాల్లో దృశ్యాలను బట్టి.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల మేరకు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరుతున్నారు.

ఆపరేషన్‌ రోప్‌..

గ‌త కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్‌ పోలీసులు ఆపరేషన్‌ రోప్‌‌ను తీసుకొచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసందిే. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద సర్కిల్స్ వద్ద స్టాప్‌ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేస్తే రూ.1000, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్ విధిస్తున్న విషయం తెలిసిందే.

ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ రోప్‌ విజయవంతం కావడంతో.. తాజాగా ట్రాఫిక్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.