Hyderabad: నగరవాసులకు అలెర్ట్‌.. నేటి నుంచి ఈ రూట్లో మూడు నెలల పాటు ట్రాఫిక్‌ మళ్లింపులు

బుధవారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కమిషనర్‌ తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ఆంక్షలను గమనించాలన్నారు. డైవర్షన్ టైమ్​లో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

Hyderabad: నగరవాసులకు అలెర్ట్‌.. నేటి నుంచి ఈ రూట్లో మూడు నెలల పాటు ట్రాఫిక్‌ మళ్లింపులు
Traffic Diversions

Updated on: Nov 23, 2022 | 9:40 AM

నగరంలోని బేగంపేట పరిధిలోని రసూల్‌పురా- రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల నేపథ్యంలో బుధవారం (నవంబర్‌ 23) నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కమిషనర్‌ తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ఆంక్షలను గమనించాలన్నారు. డైవర్షన్ టైమ్​లో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం ఈ మార్గంలో మళ్లింపులు ఇలా ఉండనున్నాయి.

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

  • బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట, వీపీఎన్‌ఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లేందుకు రసూల్‌పురా టీ-జంక్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకునేందుకు అనుమతి లేదు. కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట వైపు రసూల్‌పుర నుంచి వెళ్లే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకోవాల్సి ఉంది. హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా, కిమ్స్‌ ఆసుపత్రుల వైపు వెళ్లొచ్చు.
  • రాణిగంజ్‌, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పుర వైపు అనుమతించరు. అటువైపుగా వచ్చే వాహనాలు రాంగోపాల్‌పేట ఠాణా, సింధికాలనీ, ఫుడ్‌వరల్డ్‌, హనుమాన్‌ టెంపుల్‌ మీదుగా వచ్చి ఎడమవైపు తీసుకుని రసూల్‌పుర వైపు వెళ్లే మార్గముంది.
  • సికింద్రాబాద్‌ వైపు నుంచి కిమ్స్‌ ఆసుపత్రి వైపు వచ్చే వాహనాలు హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఎడమకు తీసుకుని, ఫుడ్‌ వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా మీదుగా ఎడమకు మళ్లి కిమ్స్‌ ఆస్పత్రి వైపు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ఫ్లైఓవర్‌ నుంచి ఎడమకు తీసుకుని రాణిగంజ్‌ మీదుగా వచ్చి కుడి వైపుగా కిమ్స్‌కు చేరుకోవచ్చు.
  • అంబులెన్స్‌లు లేదా రోగులను బేగంపేట ఫ్లైఓవర్‌ వైపు నుంచి కిమ్స్‌కు తీసుకువెళ్లాలంటే సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకుని రాంగోపాల్‌పేట ఠాణా నుంచి కిమ్స్‌ వైపు వెళ్లే ఛాన్సుంది. ఇక భారీ వాహనాలు మినిస్టర్‌ రోడ్‌ వైపు వెళ్లాలంటే మాత్రం రాణిగంజ్‌ మార్గంలో రాకపోకలు సాగించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..