Telangana: తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు.. పోలీసుల తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత

|

Jun 18, 2022 | 1:51 PM

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్(Bibi Nagar) టోల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చెలరేగిన అల్లర్ల ఘటనలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ కుటుంబసభ్యులను...

Telangana: తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు.. పోలీసుల తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత
Revanth Reddy
Follow us on

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్(Bibi Nagar) టోల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చెలరేగిన అల్లర్ల ఘటనలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని రేవంత్ రెడ్డి(Revant Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నివిధాలుగా ఆలోచించి, చర్చించి తీసుకువస్తే నిరసనలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. సైనికులను నాలుగేళ్ల ప్రాతిపదికన నియమించడం దారుణమని ఆక్షేపించారు. అగ్నిపథ్‌పై(Agnipath) దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమన్న రేవంత్ రెడ్డి.. కేంద్రం వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను చట్టాలు చేసిన తర్వాత పార్లమెంట్‌లోకి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలు సిద్ధం చేసుకున్న ఉద్యోగార్థుల పట్ల అగ్నిపథ్ పథకం ద్వారా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దారుణమని అన్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఘర్షణలు జరిగాయి. ఈ గొడవల్లో ఒకరు చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించకుండా అమిత్‌షా దగ్గరకు వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోనే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అల్లర్లు జరిగాయని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ పిలుపునిస్తే టీఆర్ఎస్, ఎంఐఎం దాడి చేశాయా. అసలు ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమేనా..?

      – రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..