Revanth Reddy Hording: హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం నగరంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురియడంతో హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కొన్ని గంటల నుంచీ భారీ వర్షం కురవడంతో సిటీలో ఎటు చూసినా రోడ్లు చెరువులను తలపించాయి.
మరోపక్క హైదరాబాద్ లో రాజకీయ సందడి. ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, రేపు షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయపార్టీ ఏర్పాటు నేపథ్యంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భారీగా కురిసిన వర్షాలని చాలా చోట్ల రేవంత్ రెడ్డి, వైయస్ షర్మిల హోర్డింగ్స్ పాక్షికంగా, మరికొన్ని చోట్ల పూర్తిగా కూలిపోయాయి.
అటు, మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి, శుభాకాంక్షలు తెలిపే క్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన హోర్డింగ్ గాలి వానకు కూలిపోయింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక సి ఐ నరేందర్ సకాలంలో స్పందించి ప్రమాదానికి గురైన దంపతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Read also: Etela: ‘ఆ లేఖ నాది కాదు..’ మధువని గార్డెన్‌లో రాజేందర్ రుస రుస.! హుజూరాబాద్ ప్రజలకు నివేదన