హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పక్క ఇళ్లకు కూడా వ్యాపించడంతో అక్కడ భీతావాహ వాతావరణం నెలకొంది. పోలీసులు, అగ్ని ప్రమాదక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. కాగా మృతులు వరంగల్ జిల్లాకు చెందిన సుమ, నరేశ్, బాబులుగా గుర్తించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపుతలు స్పాట్‌కు వెళ్లి పరిశీలంచారు. బాధితులను ఓదార్చారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మరోవైపు అటు బహదూర్‌పురాలోని లారీ వర్క్‌షాప్ గోదాంలో కూడా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి మరింత సమచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..