Telangana Rising Global Summit 2025: క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూర్ , ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ అభివృద్దిలో ముందుకు సాగుతోందని భట్టి పేర్కొన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేవలం పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్ పెట్టలేదని.. తమ విజన్ ఏంటో అందరికీ వివరిస్తామని తెలిపారు.

Telangana Rising Global Summit 2025: క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka

Updated on: Dec 08, 2025 | 4:59 PM

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ అట్టహాసంగా ప్రారంభమైంది. భవిష్యత్‌ తెలంగాణ ఎలా ఉండబోతోంది.. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇదే కీలకాంశంగా.. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో విజన్‌ 2047ని ఆవిష్కరించింది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ముఖ్యమంత్రి రేవంత్‌ నేతృత్వంలో… రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ సమ్మిట్‌ను మధ్యాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో… కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూర్ , ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ అభివృద్దిలో ముందుకు సాగుతోందని భట్టి పేర్కొన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేవలం పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్ పెట్టలేదని.. తమ విజన్ ఏంటో అందరికీ వివరిస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి అనేక లక్ష్యాలతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని.. ఒక్కో అంశంపై ఒక్కో ప్రణాళికతో ముందుకెళ్తున్నామని.. పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.

భట్టి విక్రమార్క వీడియో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..