Telangana: జై షా తన పదవి నుంచి తప్పుకోవాలి.. మంత్రి గంగుల షాకింగ్ కామెంట్స్
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ...
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభాస్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని, జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి సభ కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సుమారు 40 ఎకరాల స్థలంలో వేదిక ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై గంగుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోధా కమిటీ ప్రకారం రెండు టర్మ్ లు కంటే ఎక్కువ ఎవరు ఉండకూడదని, అయితే రెండు టర్మ్ లు పని చేసిన వారు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నారని చెప్పారు. కొత్తవారికి అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. జై షా తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కు ప్రత్యేక అవకాశాలు ఇస్తే మనకు ఎక్కువ పతకాలు వస్తాయని, కొత్త బీసీసీఐ ని ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సభ జరిగే ప్రాంతానికి చేరుకోవడానికి వీలుగా రహదారులను నిర్మిస్తున్నారు. పెద్దపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే ప్రాంతాలను అదనపు డీజీపీ పరిశీలించారు. సభా వేదిక ప్రాంతంలో వాహనాల అనుమతి, పార్కింగ్ వంటి అంశాలపై సూచనలిచ్చారు.
టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ బిల్డింగ్ నుంచి బహిరంగ సభ జరిగే ప్రాంతం వరకు రహదారికి ఇరువైపులా చదును చేస్తున్నారు. అక్కడ మొక్కలు నాటుతున్నారు. డివైడర్‌లను శుభ్రం చేశారు. ఈ నెల 29న సీఎం కేసీఆర్ పర్యటనలో ఎలాంటి లోటు రావద్దని పాలనాధికారిణి డాక్టర్ సర్వే సంగీత తెలిపారు. గురువారం పాలనా ప్రాంగణ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి