Telangana: ఇంటర్ కాలేజీల అకాడమిక్ క్యాలెండర్ ఇదే.. దసరా, సంక్రాంతి సెలవుల లిస్టు ఇదిగో.!
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోధనకు సంబంధించి వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 1న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. అంటే 2024-25 ఏడాదికి గాను 2024 జూన్ 1న జూనియర్ కాలేజీలు..
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోధనకు సంబంధించి వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 1న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. అంటే 2024-25 ఏడాదికి గాను 2024 జూన్ 1న జూనియర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులకు మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
దీంతో జూన్ 1న తిరిగి జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో అదనపు తరగతులు లేదా ముందస్తు తరగతుల పేరుతో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జూనియర్ కాలేజీలను ఇంటర్మీడియట్ బోర్డ్ హెచ్చరించింది. విద్యార్థుల అడ్మిషన్ సైతం ఇంటర్ బోర్డు నుంచి అడ్మిషన్ ప్రకటన వచ్చిన తర్వాతే జాయిన్ చేయించుకోవాలని సూచించింది.
వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి గాను 220 వర్కింగ్ డేస్ ఉండనున్నట్లు ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. 75 హాలిడేస్ ఆదివారాలు పండగల సెలవులు కలుపుకొని ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది దసరా హాలిడేస్ అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు ఉండనున్నాయి. హాఫ్ ఇయర్ లీ ఎగ్జామ్స్ నవంబర్ 18 నుంచి నవంబర్ 23 వరకు నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవులు 2025 జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి 29 నాటికి అకడమిక్ ఇయర్ సెకెండ్ ముగించెలా షెడ్యుల్ ఇచ్చారు.